మెంతి-టమటా పచ్చడి తయారీ విధానం



కావాల్సిన పదార్ధాలు
మూడు కట్టలు మెంతి ఆకు
రెండు టమాటాలు
ఐదు ఎండుమిర్చి
ఒక రెమ్మ కరివేపాకు
నాలుగు వెల్లుల్లి రెబ్బలు
ఒక టీ స్పూన్ జీలకర్ర
ఒక టీ స్పూన్ ‌ శనగపప్పు
కొద్దిగా ‌ చింతపండు
ఒక స్పూన్ బెల్లం
తగినంత ఉప్పు
తగినంత నూనె
తగినన్ని‌ తాలింపు దినుసులు


తయారు చేయు విధానం:-

Step 1 
మెంతికూర ఆకులను మాత్రం తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. టమటాలను ముక్కలుగా కట్ చేసుకొవాలి. ఇప్పుడు ఒక పెన్నం తీసుకోని అందులో నూనె వేడి చేస్తూ శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి దోరగా వేయించి పక్కన పెట్లుకొవాలి. 
Step 2 
ఇప్పుడు ఆ పాత్రలోనె ఒక స్పూన్ నూనె వేసి టమాటా ముక్కలు. మెంతి ఆకులను వేసి వెగిచాలి. ముందుగా వెగించి పెట్టుకున్నఎండు మిర్చి మిశ్రమం చల్లారిన తరువాత ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చెయ్యాలి. 
Step 3 
ఇప్పుడు టమాట, మెంతికూర, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. అవసరం అయితే కొంచెం నీరు వాడొచ్చు. 
Step 4 
ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి తాలింపు దినుసులు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని అందులో వేసి రెండు నిమిషాలు వేగించాలి. అంతే మనముందు ఘుమఘుమలాడె మెంతి-టమటా పచ్చడి రెడీ.
Previous
Next Post »