అసలెలా ఈ కరోనా వైరస్ వ్యాపిస్తుంది.. దాని లైఫ్ స్పాన్ ఎంత.. ఏ వస్తువులపై ఎక్కువగా వ్యాపిస్తుంది? |



కరోనా కలవరపెడుతోంది సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి ముంచుకొస్తున్న ముప్పను కట్టడి చేయడానికి ప్రధాని ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపు నిచ్చారు. 


మొదట 14 గంటల పాటూ ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టడి చేయాలని భావించినా, ఆరు రాష్ట్రాల సీఎంలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన తర్వాత కనీసం 24 గంటల పాటూ జనతా కర్ఫ్యూ పాటించాలనే ఆలోచనకు వస్తున్నట్లు సమాచారం ఇంతకీ 24 గంటల పాటూ భారత్ బంద్ పాటిస్తే ఏం జరుగుతుంది? ప్రపంచాన్ని వణికిస్తున్న ఈవైరస్ కాలపరిమితి అసలెంత? ఎక్కడెక్కడ చురుగ్గా వ్యాపిస్తుంది? కరోనా వైరస్ లైఫ్ గురించి ఓసారి తెలుసుకుందాం.

కరోనా కరాళ నృత్యంపై ప్రపంచం హడలిపోతోంది సాధారణంగా కరోనా వైరస్ ఎన్నాళ్లు బతుకుతుంది? ఇది అందరికీ వచ్చే సందేహం దీనికి వైరస్ తీవ్రత అది విస్తరించిన ప్రాంతాన్ని బట్టి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.

కరోనా వైరస్ ఏ వస్తువుపై ఎన్నాళ్లుంటుంది?

కరోనా వైరస్ ప్లాస్టిక్, స్టీలు వస్తువులపై కనీసం 72 గంటల పాటూ యాక్టివ్ గా ఉంటుంది. అదే కార్డ్ బోర్డ్ ఉపరితలంపై అయితే 24 గంటలు బతికే ఉంటుంది ఒక్కోసారి వాతావరణం వైరస్ కి అనుకూలంగా ఉంటే కొన్ని రోజుల పాటూ బతికే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ రాగి వస్తువులపై నాలుగు గంటల పాటూ సజీవంగా ఉంటుంది.

కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ తుంపరలు ఎదుటి వస్తువుపై పడతాయి డోర్ నాబ్స్, ఎలివేటర్ బటన్స్, హాండ్ రైల్స్, కౌంటర్ టాప్స్, కంప్యూటర్ కీ బోర్డ్, డోర్ హాండ్స్, ఇలా ఇవన్నీ వైరస్ వ్యాప్తి చెందేందుకు అనువైన ప్రదేశాలే. ఈ ప్రాంతాలను మామూలు వ్యక్తి తాకితే ఆ వైరస్ నేరుగా అతని చేతుల ద్వారా ముక్కు, కళ్లు, నోటిని తాకితే శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ పడిన ప్రదేశంలో ఉష్ణోగ్రత, తేమ శాతం, వెలుగు ఆధారంగా వైరస్ రెట్టింపు అవుతుంది.

అలాగే వైరస్ పడిన ప్రాంతంలో ఎక్కువ వేడిగా ఉంటే వైరస్ అప్పటికప్పుడే చనిపోతుంది. సూర్యుడినుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కూడా వైరస్ ను నిరోధించేవే. కరోనా సమాతరంగా, కఠినమైన ఉపరితలంపైనా వేగంగా విస్తరిస్తుంది. దుస్తులపై కరోనా వ్యాప్తి చెందే ఆస్కారం కొంచెం తక్కువేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని శాస్త్రవేత్తలంటున్నారు. కరోనా నావల్ వైరస్ శ్వాస కోశ ప్రక్రియను దెబ్బతీస్తుంది. జీర్ణ క్రియను కాదు వైరస్ మన చేతులపై పడినప్పుడు మన కళ్లు, ముక్కు, నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటే హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వస్తువులు, ప్లేట్లు, కప్పుల విషయంలో జాగ్రత్త పడాల్సిందే. అందుకే మనం తరచుగా చేతులు శుభ్రపరచుకుంటుండాలి అలాగే బహిరంగ ప్రదేశాల్లో వైరస్ పడే ఆస్కారమున్న ప్రాంతాల్లో ఆ ఉపరితలాన్ని శానిటైజర్లతో ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.

మనం చేతులు తరచుగా శుభ్రపరుచుకుంటూ ఉంటే కనీసం అయిదు మందికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఆపినవారమవుతాము. మనం వాడే శానిటైజర్లు కూడా ఆల్కహాల్ బేస్డ్ వి అయితే మంచిది బేబీ వైప్స్ తో పెద్దగా ఉపయోగం ఉండదు. మనం వాడే మొబైల్ ఫోన్ లను కూడా తరచుగా శుభ్రపరుస్తూ ఉండాలి. మనకు తెలిసో తెలియకుండానో మనం తరచుగా ముఖాన్ని చేతులకు దగ్గరగా తెస్తుంటాం కళ్లు, ముక్కు, నోటి దగ్గరకు మన చేతులు అప్రయత్నంగానే వెలుతుంటాయి తరచుగా హ్యాండ్ వాష్ చేసుకున్నా వైరస్ ప్రబలే ఆస్కారమున్నందున శాస్త్రవేత్తలు ఓ చిట్కా చెబుతున్నారు చేతులను శుభ్రపరచుకున్నాక తరిగిన ఉల్లిపాయతో చేతులను రుద్దుకోమని చెబుతున్నారు మన ముఖం పైకి చేతులు వెళ్లిన ప్రతీసారి ఆ వాసన తగిలి చేతులను దూరం జరుపుకుంటామని వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అదో చిట్కా అనీ చెబుతున్నారు.
Previous
Next Post »