ధనియాల చారు





   

కావలిసిన  పదార్ధాలు :

1. కంది  పప్పు  3 స్పూన్స్
2. ధనియాలు 1 స్పూన్
3. ఎండు  మిరప కాయలు 2
4. మిరియాలు 4
5.  టమాటో  1
6.  పచ్చి మిరపకాయ 1
7 . చింతపండు 
,8. ఉప్పు 
9. బెల్లము
10.  పసుపు


తయారీ విధానము :

ముందుగా  కంది  పప్పు , ధనియాలు , ఎండు  మిరప కాయలు , మిరియాలు ఒక గంట సేపు నానబెట్టు కోవాలి.
నానిన తరువాత  , మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని , చింతపండు పులుసు ,( చింత పండు నీళ్ళలో పిండి గుజ్జు తీసేయాలి ) ఉప్పు , బెల్లము, పసుపు  ,టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ వేసుకుని , స్టవ్ మీద పెట్టి, బాగా మరిగించాలి .ఇది మరిగేటప్పుడు స్టవ్ మంటచిన్నది  గా  ఉండేలా చూసుకోవాలి. ,
పేన్  లో కొంచెము నూని  వేసి ,ఆవాలు,మెంతులు  జీలకర్ర, కొద్దిగా ఇంగువ , ఎండుమిరపకాయ ముక్కలు  , కరివేపాకు వేసి , పోపు పెట్టుకుని అందులో కలపాలి. ఆ తరువాత బాగా మరిగించాలి. బాగా మరిగిన తరువాత
దించే ముందు  , కొత్తిమీర వేసి  మూత పెట్టుకోవాలి. రుచికరమైన ఘుమఘుమలాడే ధనియాల చారు రెడీ.

Previous
Next Post »