ఇవి తరచుగా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాకుండా కాపాడుకోవచ్చు

నోటి నుంచి దుర్వాసన రాకుండా 









నోటి నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపానం, నోటి పరిశుభ్రత లోపించటం, దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటివి దుర్వాసనకు కొన్ని కారణాలు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడికి వెళ్లినా మాస్కు ధరించటం తప్పనిసరి అయింది. మరి అలా మాస్కు ధరించిన సమయంలో నోటి నుంచి దుర్వాసన తెలుస్తుందా? దానిని నివారించడానికి కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

సోంపు : 


దీన్లోని యాంటీ-సెప్టిక్‌ లక్షణాలు చెడు శ్వాసను కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఒక టేబుల్‌ స్పూన్‌ సోంపు, నోటిలో వేసుకొని నమలడం వల్ల నోరు ఫ్రెష్‌ అవుతుంది.

దాల్చిన చెక్క : 


ఇందులో ఆల్డిహైడ్‌ అనే ముఖ్యమైన నూనె ఉంటుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి దుర్వాసనను తొలగిస్తుంది. ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి కొద్దిగా నీటిలో వేసి మరిగించాలి. చల్లబడిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

నిమ్మకాయ : 



నిమ్మకాయ ముక్కను నోటిలో వేసి నమలడం ద్వారా నోరు ఫ్రెష్‌ అవుతుంది. నిమ్మ తొక్క నోటిని శుభ్రం చేస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్‌ ఆమ్లం నోటి దుర్వాసనతో పోరాడుతుంది.

కొత్తిమీర : 


ఇందులోని క్లోరోఫిల్‌ చెడు శ్వాసను తగ్గించడంలో అద్భుతమైనది. కొత్తిమీర ఆకులను నోటిలో వేసుకొని నమలాలి. దీంతో దుర్వాసన తగ్గుతుంది.

లవంగం : 


ఇందులోని యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు నోటిని రిఫ్రెష్‌ చేస్తాయి. మీ నోటిలో కొన్ని లవంగాలను నమలడం ద్వారా చెడు శ్వాసను వదిలించుకోవచ్చు. లేదా లవంగం టీని మౌత్‌ వాష్‌గా ఉపయోగించవచ్చు.

నీరు : 


రోజూ పుష్కలంగా నీరు తాగడం ద్వారా కూడా నోరు రిఫ్రెష్‌ అవుతుంది. అలాగే, మీ నోటిని చల్లటి నీటితో తరచుగా కడగడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది.

Previous
Next Post »