ఎక్కిళ్లు రాకుండా ఉండడానికి చిట్కాలుబఠాణీ గింజంత ఇంగువ ను గోరువెచ్చని నీటిలో వేసి మింగితే ఎక్కిళ్ళు పూర్తిగా తగ్గిపోతాయి.  గుండెకు కిందుగా కడుపుకు పైన ఉండే వర్తులాకారపు పొరను డయాఫ్రం అని అంటారు. ఇది ఆహారం తీసుకునే టప్పుడు అటు ఇటు కదలి శరీరంలో వత్తిడిని సమంగా ఉండేట్లు చేస్తుంటుంది. ఇది ఊపిరి పీల్చినపుడు ముడుచుకుని ఉంటుంది. ఊపిరివదలగానే మళ్ళీ మామూ లుగా ఉంటుంది. దాంతో శ్వాసక్రియ క్రమ బద్ధంగా జరుగుతుంది. ఏ కారణంవల్లనైనా అది సరైన క్రమ పద్ధతిలో అన్వయించుకోక పోవడం వల్ల చర్య క్రమం తప్పుతుంది.

ఇలాంటి సమయంలో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీంతో ‘హిక్‌ అనే శబ్దం వస్తుంది. దీన్నే ఎక్కిళ్ళు అంటారు. నిజానికి ఎక్కిళ్ళు అనేది జబ్బు కాదు.శరీరానికి సరిపడని ఆహారపదా ర్థాల వల్ల, కడుపుబ్బరం, గ్యాస్‌, ఆదుర్ధా, భయం, దుఃఖం లాంటి మానసిక కారణాల వల్ల కూడా ఎక్కిళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

మూలికా చిట్కాలు:
కొబ్బరిని చితకగొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాలవంటి పదార్థం వస్తుంది. వీటిని తాగినా లేక నిమ్మరసం తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి. ౖ జామకాయలు తింటే ఎక్కిళ్లు పోతాయి
ఉసిరిక వలపు, శొంఠి, పిప్పళ్ళు వీటిని సమ భాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు స్పూనుచొప్పున రోజూ రెండు పూటలా తింటే ఎక్కిళ్ళు తగ్గి పోతాయి.

పచ్చితాటాకు నమిలి ఊటను మింగుతుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. ౖ మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే వచ్చే పొగను పీలిస్తే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ౖ నాలుకకు తేనె రాసుకున్నా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయల లేక చెట్టు కాడ రసాన్ని నాలుగు స్పూనులు కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు పోతాయి. పేలాలు తింటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

కరక్కాయ లేదా శొంఠి పై పెచ్చు చూర్ణం అరస్పూను తీసుకుని ఒకస్పూను తేనె కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. ౖ నేల ఉసిరి ఆకుల్ని నమిలి మింగుతూంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. ౖ కొబ్బరి బోండాం నీళ్ళు తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

తాటికాయకు చిన్న గాటు పెడితే నీరు లాంటి ద్రవం వస్తుంటుంది. దీనిని పూటకు అరకప్పు చొప్పున రోజూ రెండు పూటలా ఉదయం, సాయంత్రం తాగుతుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. వేయించిన జీలకర్రను కొద్దిగా నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే ఆరసం గొంతు లోకి వెళితే ఎక్కిళ్ళు పోతాయి.

కొద్దిగా ధనియాలు తిన్నా ఎక్కిళ్ళు తగ్గుతాయి. రాసి ఉసిరికాయలు తింటుంటే ఎక్కిళ్ళు పూర్తిగా తగ్గుతాయి. ప్రతిరోజూ వీటి రసం తాగినా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

ముఖ్యమైన మూలికా చిట్కాలు:

పచ్చిపసుపు, స్వరసంలో కరక్కాయని మెత్తగా నూరిపైన లేపనం చేస్తే గోరుచుట్టు తగ్గుతుంది. ౖపచ్చిపసుపు, మాని పసుపు, మంజిష్ట, ఆవాలు, మేకపాలతో కలుపుకుని మెత్తగా నూరి చర్మానికి రాస్తే చర్మం మృదువుగా, కోమలంగా ఉండటమే కాక చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. ౖ రెండు భాగాలు నేల ఉసిరి, ఒక భాగం జఠమాంసి, ఒక భాగం అశ్వగంధి, ఒక భాగం బావంచాలు సేకరించి చూర్ణం చేసి అయిదు గ్రాముల చొప్పున మంజిష్ట వేరు కషాయంతో గానీ, సుగంధ పాల వేరు కషాయంతో గాని సేవించిన సొరియాసిస్‌ శాంతిస్తుంది.

ఏనుగు దంతాలు భస్మం చేసి రసాంజనం కలిపి లేపనం చేస్తూ వుంటే బట్టతలపై వెంట్రుకలు వచ్చే అవకాశముంది. తీగ ముషిణి వేరు చూర్ణం మూడు గ్రాములు ప్రతిరోజూ ఉదయం, సాయం త్రం సమయాల్లో మూడు నెలలపాటు సేవిస్తే బోదకాలు తగ్గుతుంది.

0 Comments:

Post a Comment