మృదువైన చర్మం కోసం మొక్కజొన్న










చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్ధనా చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. గుడ్డులోని తెల్ల సొన, టేబుల్ స్పూన్ పంచదార, అర టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేయడం వల్ల ముఖం మీద వచ్చిన అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి.

టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లేక్స్‌ను పొడి, ఓట్స్ పొడి, తగినన్ని పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు అలాగే ఉంచి,తర్వాత ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మకాంతి మెరుగవుతుంది.


కార్న్‌ఫ్లేక్స్ పొడిలో అర టీ స్పూన్ పసుపు, బాదాం నూనె, కొద్దిగా వెచ్చని నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు, మడమలకు రాసి మృదువుగా రుద్దాలి. దీంతో గరుకుగా మారిన పాదాల చర్మం మృతకణాలు తొలగిపోయి మృదువుగా మారుతుంది.
Previous
Next Post »