మైసూరు బోండాలు తయారీ విధానం




కావలసిన పదార్థాలు:--

మైదాపిండి -- 2 కప్పులు
బియ్యంపిండి -- 1/2 కప్పు 
పుల్లటి పెరుగు -- 2 కప్పులు 
బొంబాయి రవ్వ -- 4 స్పూన్స్ 
అల్లం + పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్ 
ఉప్పు -- తగినంత 
వంటసోడా -- 1/4 స్పూన్ 
నూనె -- 1/4 కేజీ 


తయారీ విధానం:--

పైన చెప్పిన పదార్థాలు అన్నీ  పుల్లటి పెరుగులో వేసి 2 గంటలు ముందు నానబెట్టుకోవాలి.ఈ పిండి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా నానితే, బోండాలు అంత మెత్తగా, మృదువుగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత, పిండిని కొంచెం-- కొంచెం చేతితో చిన్ని -చిన్ని ఉండలుగా తీసుకొని, నూనెలో వేస్తే గుండ్రంగా బోండాలు, పెద్దవిగా పొంగుతాయి. ఇలాగే అన్నీ వేయించి తీసుకొని, మనకి నచ్చిన చెట్నీతో తినొచ్చును. అంతే వేడి -- వేడి మెత్తని మైసూరు బోండాలు రెడీ...
Previous
Next Post »