కారు చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి ఎందుకు



సినిమాల్లో కార్లు వేగంగా వెళ్ళే దృశ్యం చూస్తున్నపుడు , కారు చక్రాలు మొదట్లో ఒక దిశలో తిరిగి మల్లి వెనక్కు తరిగినట్లు కనిపిస్తాయి . ఎందువల్ల ?
కారణం ... మన దృష్టి పై కాంతి ప్రదర్చించే ఒక భ్రమ . కారు చక్రాలు తిరుగుతున్నప్పుడు ఆ భ్రమనానికి కొంత పౌన:పుణ్యం (frequency) ఉంటుంది . భ్రమణం/పౌన:పుణ్యం అంటే ... ఒక సెకనుకు కారు చక్రాలు ఎన్ని భ్రమనాలు (turns) చేస్తున్నాయనే సంఖ్య . .. ప్రోజక్తర్ లో రీలు వేగంగా తిరగడం వల్ల తేరా మీద ఒక దాని తర్వాత ఇఒకటిగా నిశ్చల చిత్రాలు చక చక మారి మనకు దృశ్యం కదులు టున్న భ్రమ కలుగుతుంది . ఆ విదంగా సినిమా తేరా మీద పడే ఫిల్మ్ ప్రతిబింబలకు కుడా పౌన:పుణ్యం ఉంటుందన్నమాట . అంటే తెరపై సెకనుకు ఎన్ని చిత్రాలు పడుతున్నయనే (విక్షేపం )సంఖ్యే అది .
మాములుగా సినిమా తెరపై సెకనుకు 24 ఫిల్మ్లు విక్షేపం(appear) అవుతాయి . ఫిల్మ్ లోని Car చక్రాల భ్రమణాలు సెకనుకు 24 కన్నా తక్కువ ఉంటే Car చక్రాలు వెనుకకు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది . Car బయల్దేరినపుడు దాని వేగం తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా కనబడుతుంది .Car చక్రాల భ్రమణ పౌ న: పుణ్యం సరగ్గా 24 అయితే చక్రాలు తిరగ కుండా నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తాయి . కారు వేగం ఎక్కువయ్యే కొలదీ చక్రాలు తిరిగే frequency 24 కంటే ఎక్కువవడం వల్ల అవి దిశను మార్చి ముందుకు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తాయి . అంటే కారు చక్రాలు మొదట్లో వెనక్కు తిరిగి తర్వాత కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉంది అ తర్వాత ముందుకు తితుగుతున్నట్లు అనిపిస్తుంది .

పౌన:పుణ్యాల తేడాల వల్ల కలిగే ఈ వింత దృశ్య ఫలితాన్ని భౌతిక శాస్త్రం లో " Stroboscopic effect " అంటారు .
Previous
Next Post »