ఒకే సామర్ధ్యం ఉండే ఫిలమెంట్ బల్బుల కన్నా మెర్క్యురి లేదా సోడియం వాయువులు నింపిన ట్యూబ్ లైట్లు ఎక్కుమ కాంతిని అందిస్తాయి . ఏదైనా పదార్ధం గుండా విధ్యుత్ ప్రవహించినపుడు ఉష్ణ శక్తి , కాంతి శక్తి వెలువడతాయి . ఫిలమెంట్ బల్బు లో విద్యుత్ ఒక సన్నని' టంగ స్టన్ ' తీగ ద్వార ప్రవహించినపుడు ఎక్కువ కాంతి ఉత్పన్నమవుతున్నా , కొంత శక్తి ఉష్ణము గా మారి వృదా అవుతుంది . ఫిలమెంట్ ఉపరితల వైశాల్యము , పొడవుల పై కాంతి శక్తి ఆధారపడి ఉంటుంది .
వాయువులు నింపి ఉండే ట్యూబ్ లైట్ల లో ఎలేక్త్రాన్లు రుణధ్రువము నుండి ధనద్రువానికి ప్రవహిస్తాయి .ఈ వాయువుల అణువులు విద్యుద్వాహ కాలు(conductors) కాబట్టి వాటి గుండా పయనించే ఎలేక్ట్రోన్స్ కాంతి ని వెలువరిస్తాయి . ఈ ప్రక్రియలో ఉష్ణ శక్తి వెలువడే ప్రశ్నే ఉండదు . పైగా కాంతి వెలువడే ప్రదేశపు ఘనపరిమాణము కుడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్యూబ్ లైట్ ... ఫిలమెంట్ బల్బు కన్నా ప్రకాశవంతం గా వెలుగుతాది .
EmoticonEmoticon