ఇప్పుడు ‘మీ టూ’ ఉద్యమం గురించి తెలియని వాళ్లు, వినని వాళ్లు లేరేమో. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమ మనసులోని వేదనను చిమీటూ అంటూ వెలుగులోకి తెస్తున్నారు. దీని ద్వారా తమలాంటి బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతున్నారు. ప్రస్తుతం ఈ ఉద్యమం అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక భయంతో మానసిక వేదన అనుభవిస్తున్న వారెందరో ఇప్పుడు ధైర్యంగా ఈ ఉద్యమం ద్వారా తమ గొంతెత్తుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం మొదలుపెట్టారు. అలాంటి మహిళలకు మరికొందరు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు తమ వంతుగా చేయూతనందిస్తామని, ‘మీ టూ కి వీ టూ..’ అంటూ ఇద్దరు యువతులు ముందుకొచ్చారు. బాధితులకు తమ సంఘీభావం తెలుపుతున్నారు. అంతేనా... చట్టపరంగా వారికి న్యాయం జరిగేలా చేస్తామంటూ భరోసా ఇస్తున్నారు. దిల్లీకి చెందిన వీరా మహూలీ, ముంబయికి చెందిన రుతుజా షిండే వృత్తిపరంగా న్యాయవాదులు. ప్రస్తుతం మహిళా ఉద్యమంగా మారిన ‘మీ టూ’కి తమ మద్దతు పలికారు. మగవాళ్ల నుంచి లైంగిక వేధింపులకు గురైన బాధితులెవరైనా కూడా ‘మమ్మల్ని సంప్రదించొచ్చు...’ అని ప్రకటించారు. వారిచ్చిన మెయిల్ ఐడీ, లేదా ట్విట్టర్ చిరునామాలో ఎవరైనా తమ సమాచారాన్ని, వివరాలను పంపిస్తే చాలు... బాధితుల వెనుక తాము ఉంటామని చెబుతున్నారు. తమను సంప్రదించాల్సిన ఈమెయిల్, ట్విట్టర్ ఐడీలను కూడా పేర్కొన్నారు. ఎలాంటి రుసుము తీసుకోకుండానే వాళ్లకు సాయం చేస్తామని చెబుతున్నారు.
idrutuja.s.shinde@gmail.com
Twitter handle:@veeramahuli
EmoticonEmoticon