పిల్లులకు పొడవుగా , బిరుసుగా , మందం గా ఉండే మీసాలు .. దాని నోటిపై మూలాలకు ముక్కు అంచులకు మధ్య ఉబ్బెత్తుగా ఉండే ప్రదేశం లో భూమికి సమాంతరం గా ఉంటాయి . ఈ మీసాల వెంట్రుకలు దాని శరీరము పై ఉండే వెంట్రుకలకు భిన్నం గా ఉంటాయి . ఈ మీసాల మూలాలు నరాలు రక్త నాళాలు ఎక్కువగా ఉండే ప్రదేశం లో లోతుగా ఉండటం తో స్పర్శ జ్ఞానం కలిగి దాని మార్గ నిర్దేశానికి (navigation) ఉపయోగ పడటమే కాకుండా , దాని మానసిక పరిస్థితిని కుడా తెలియజేస్త్యాయి .
పిల్లి మీసాలు ఎంత సున్నితము గా ఉంటాయంటే .. అవి తన చుట్టూ వీస్తున్న గాలి దిశలలో కొద్దిపాటి తేడాలను కుడా పసిగట్ట గలవు . గదిలో సామాగ్రి ఉన్నా ప్రదేశాలను బట్టి అక్కడ వీచే గాలి ప్రవాహం ఆధాపడి ఉంటుంది . పిల్లి ఒక గదిలో తిరుగు తున్నప్పుడు ముఖ్యం గా రాత్రివేళల్లో ఒక కుర్చీ లేక మంచం అడ్డం వస్తే ఆ వస్తువు చుట్టూ గాలి వీచే పరిస్థితిని తన మీసాల ద్వారా తెలుసుకొని ఆ వస్తువును ఢీ కొట్టకుండా మార్గాన్ని నిర్దేశించుకుంటుంది . అదే విధంగా ఒక ఇరుకైన సొరంగం లాంటి మార్గం లో పోవలనుకున్నప్పుడు ఆ మార్గం లో తను వెల్ల గలదా? ఒక వేళ వెళ్ళిన అందులో నుంచి సురక్షితం గా బయటకు రాగలడా? అనే విసయాన్ని మీసాలను ఆ మార్గం అంచులకు తాకించి అంచనా వేసుకుంటుంది . ఆ విధమ గా పిల్లి మీసాలు దానికి ప్రక్రుతి ప్రసాదించిన కొలబద్ద లాంటిది .పిల్లి కోపమా గానో లేక ఆత్మ రక్షణలో పడినప్పుడు మీసాలను వెనుక్కు లాక్కుంటుంది . అదే ఏదైనా ఆహారము దొరికే ముందు సంతోషం గా ఉన్నప్పుడు మీసాలను సడలించి ముదుకు ఉంచుతుంది . ఇలా పిల్లి మీసాలు దాని మానసిక పరిస్థితి ని కుడా తెలియజేస్తాయి .
EmoticonEmoticon