చర్మం మెరుస్తూ నిగనిగలాడాలంటే ఎం చేయాలో ఇలా తెలుసుకోండి




ప్రతీ స్త్రీ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది. అయితే కాలుష్యం, ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం, తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం, వంటివి జరగవచ్చు. ఇలాంటి దుష్ప్రాబావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.


* బొప్పాయి,అరటి,జామ,ఆపిల్ వంటిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
* నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.

* ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
* తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.

* నానబెట్టిన బాదం పప్పు ఉదయాన్నే తిసుకుంటే చర్మం పొడిబారదు
* టీస్పూన్ కీరాజ్యూస్‌లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
* ఎక్కువగా పళ్ళరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది.
* కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది
Previous
Next Post »