మహా భారతంలో భీముడు గురించి





మహా భారతంలో భీముడు గురించి

శౌర్యప్రతాప పరాక్రమాలకు ప్రతీకలుగా పంచపాండవ్ఞలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవ్ఞలు, వ్యాసవిరచిత మహాభారతంలో మహానుభావ్ఞలుగా, మహిలో వినుతిగాంచిన పురాణ ప్రముఖులు. అతి బలాఢ్యులై చేతిలో గదాయుధంతో అన్నగారిపట్ల విధేయుడై ఆయన ఆజ్ఞను మీరక, తనకన్నా చిన్నవారైన అర్జున, నకుల సహదేవ సోదరుల పట్ల ప్రేమతో వారితోనే కలసి, కాపుకాసిన యోధుడు భీముడు. 




పేరుకు పాండురాజు పుత్రుడైనా ఆయన వాయుదేవ వరప్రసాదిగా, ఎన్నో గొప్ప పనులతో ప్రసిద్ధిగాంచాడు. దుర్యోధన విరోధిగా, భీముడు, చివరకు ఆయనను మడుగుతో మట్టుపెట్టిన ఘనుడు. కౌరవ్ఞల వ్యూహంతో, లక్క ఇంటికి నిప్పంటించగా అందులో ఉన్న సోదరులను రక్షించిన, పరాక్రమశాలి భీముడు. రాక్షస వనిత హిడింబిని పెండ్లాడి, మరో వీరపుత్రుడు ఘటోత్కచుని కన్న తండ్రిగా, భీముడు భారతంలో ఎన్నో సాహసాలు చేసిన ధీశాలి. పాండవ్ఞలు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషధారులై బిక్షాటన చేసే సమయంలో తాము నివశించే ఇంటి యజమాని కుమారుడి బదులు, తానే బకాసురుడనే రాక్షసుడికి, ఆహారంగా వెళ్లి, బకాసుర సంహారం కావించి, త్యాగశీలిగా, కీర్తి పొందిన భీముడి సాహసం, అనితర సాధ్యం. నిండుసభలో, భార్య ద్రౌపతిని కౌరవ్ఞలు పరాభవించగా, దుర్యోధన, దుశ్శాసునులను చంపి వారి రక్తంతో ద్రౌపతి జుట్టు ముడివేస్తాననే ప్రతిజ్ఞ చేసిన పరాక్రమశాలి భీముడు.
వనవాసకాలంలో ద్రౌపతిని బాధించి, వేధించిన కీచకుడి వధ గావించి, వినుతికెక్కాడు. విరాట కొలువ్ఞలో వలలుడు పేరుతో పంటలు చేసిన భీముడు, రుచికరమైన పదార్థాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడిగా నలభీమ పాకంగా పేరొందాడు.
కుంతి ఆహారవిషయంగా, సగభాగం భీముడికి కేటాయించి, మిగిలిన భోజన పదార్థాల్ని మిగతా వారందరికీ సమంగా పంచేదని చెప్పడం, బలశాలి భీముడి ఆకలిని తెలియజేస్తుంది. ఉదారహృదయుడు. మల్లయుద్ధనేర్పరి, ప్రేమశీలి, నిర్భయుడు, వజ్రశరీరుడుగా పంచమవేదమైన మహాభారత ప్రముఖుడు భీముడు. అన్నిటి ఆదర్శప్రాయుడు.
Previous
Next Post »

3 Comments

Write Comments
September 3, 2019 at 6:33 AM delete

ద్రౌ ప తి ... కాదండి ... ద్రౌ ప ది ... అని వ్రాయాలి.

Reply
avatar
February 18, 2020 at 8:44 PM delete

అలాగే 'భీముడు గురించి' అని వ్రాయటం అనుచితం. 'భీముడి గురించి' అని వ్రాయాలి.

Reply
avatar
February 20, 2020 at 1:02 PM delete

లేదా "భీమునిగురించి" అని కూడా రాయొచ్చునేమో?

Reply
avatar