ముల్లంగి గింజలను రోజుకు ఒకసారి నోట్లో వేసుకుని నముతూ ఉంటే దంతాలు గట్టిపడతాయి. పొగడ చెట్టు బెరడును నమిలితే, కదిలే దంతాలన్నీ గట్టిపడడంతో పాటు తెల్లగా మెరుస్తాయి. నువ్వుల నూనెతో సైందవ లవణం వేసి కాసేపు పుక్కిలిస్తే కొద్ది రోజుల్లోనే దంతాలు, చిగుర్లు గట్టిపడతాయి. సుగంధిపాల ఆకును నూరి, పిప్పి పన్ను సందులో పెడితే, పిప్పి పోవడంతో పాటు వెంటనే దంతం గట్టిపడుతుంది. పిప్పళ్లు, జీలకర్ర, సైందవలవణం సమ భాగాలుగా తీసుకుని పొడిచేసి చిగుళ్లను రుద్దితే వాపు, రక్తస్రావం ఆగుతాయి. జాపత్రిని అప్పుడప్పుడు నోట్లో వేసుకుని కాసేపు అలా ఉండిపోతే, ఆహార పదార్థాలను చక్కగా నమలగలుగుతాం. నోటి సమస్యలుంటే పోతాయి.
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »
Subscribe to:
Post Comments (Atom)
EmoticonEmoticon