ప్రేమ




నువ్వు అందంగా ఉంటే నీకోసం ఓ వంద మంది పడి చస్తారేమో ...,
నీ తల్లి తండ్రుల ఆస్తులో, నీ సంపాదనో చూసి
ఓ వేయి మంది నీకోసం నీ వెంటపడతారేమో ...,
నీ పేరు ప్రఖ్యాతులు చూసి నిన్ను ఇష్టపడి నీకోసం వస్తారేమో ....,

కానీ,

నీ తల్లి తండ్రుల చరిత్రలు, నీ ఆస్తుల వివరాలు, నీ కులము మతము, నీ పేరు ప్రఖ్యాతులు
ఇవేమీ పట్టించుకోకుండా
నిన్నూ నీ మనసుని చూసి, నీ ఆనందం కోసం ఏమైనా చేసేదే ప్రేమంటే...
అందం ఆస్తులూ పేరు ప్రఖ్యాతులూ నీ చుట్టూ ఉండే సమాజానికి కావాలేమో...,
నీ మనసులో ప్రేమకి కాదు
ఒక మనసు ఇంకో ప్రేమించే మనసునే కోరుకుంటుంది, ఆ మనసునే ప్రేమిస్తుంది ...
మనసులోని పవిత్రమైన ప్రేమ శాశ్వతం గాని,
ఈ రోజు ఉండి రేపు పోయే క్షణికానందాలు శాశ్వతం కాదు...
Previous
Next Post »