మగువ ఇష్టపడే గాజుల డిజైన్లు మార్కెట్లో లెక్కకు మించి కనిపిస్తుంటాయి. అయితే మనకు మనంగా అందమైన గాజులను తయారుచేసుకొని ధరిస్తే కలిగే ఆనందమే వేరు..
ఎంపిక: ఒక ప్లాస్టిక్ గాజు, నూలు లేదా సిల్క్ దారం, స్వెటర్ అల్లే సూది తీసుకోవాలి.
ఇలా చేయండి:
1. ప్లాస్టిక్ గాజును తీసుకొని, ఎంచుకున్న దారం చివరతో ఒక ముడివేయాలి.
2. నీడిల్‌ను ఆ ముడిలోకి జొప్పించి మరో చేత్తో పట్టుకున్న దారాన్ని గాజు చుట్టూ తీసుకుంటూ నీడిల్‌తో తిప్పి, మరో ముడిని వేయాలి.
3. ఇలాగే మొత్తం గాజు చుట్టూ అల్లి, చివరగా ఉన్న దారాలను పెద్ద సూదితో ముడివేయాలి.
4. ఇలా పూర్తి చేశాక, గాజు అల్లిక అందంగా కనిపిస్తుంది. రకరకాల రంగు గాజులను ఇలా తయారుచేసుకొని, ధరించవచ్చు.
EmoticonEmoticon