సూక్ష్మంతో మోక్షం అంటే ఏమిటో తెలుసునా?

మనం అన్నాన్ని, లేదా ఏదైనా పండును, లేదా మరొక
పదార్థాన్ని తింటున్నా మనుకోండి.
అది మామూలు అన్నం. లేదా పండు. దానినే
తినబోతూ ఒక్క క్షణం మనకు ఇష్టమైన
భగవంతుడిని తలచుకొని, ఆ పదార్థాన్ని అతనికి
నివేదిస్తున్నట్లు భావించుకొని తిన్నట్లయితే ఆ
అన్నం ప్రసాద మవుతుంది. ఆ పండు ప్రసాద మవుతుంది.
ప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. భగవంతుని అనుగ్రహం. దీనివలన మనకు ఆ భగవదనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
సూక్ష్మంతో మోక్షం అంటే ఇదే!!
Previous
Next Post »