తెలుగు ఆడపడుచు నుదుటన కుంకుమ ఎంత అందమో... ఆమె చేతికి గాజులూ అంతే అందం. ఆ అందాన్ని ఇనుమడింపజేసే ప్రయత్నంలో గాజులకు రకరకాల సొబగులు అద్దుతున్నారు తయారీదారులు. ఆ క్రమంలో కనిపెట్టినవి త్రెడ్ బ్యాంగిల్స్. రంగురంగుల సిల్కుదారాలతో చేసే గాజులు ఇప్పుడు కొత్త ట్రెండ్. అయితే వీటిని షాపులకు వెళ్లే కొనుక్కోవాల్సిన పని లేదు. ఎవరికి వారు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కావలసినదల్లా పాత గాజు, సిల్కు దారం.
చక్కగా ఓ పద్ధతిలో గాజుకు దారాన్ని చుట్టడం వస్తే అందమైన గాజు తయారైపోయినట్టే. మరింత అందంగా ఉండటానికి రంగురంగుల దారాలు వాడొచ్చు. బంగారువర్ణపు జరీదారాన్ని కలిపినా, స్టోన్స్ లాంటివి జత చేసినా అందం మరింత పెరుగుతుంది. కాబట్టి ఆలస్యమెందుకు! ఒక్కసారి వీటిని చూడండి. ఫాలో అయిపోండి.
EmoticonEmoticon