రూపాయి నోటు ప్రింటింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇది గనుక తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రూపాయి విలువ కంటే దాని ప్రింటింగ్ ఖర్చే ఎక్కువ అవుతోంది.భారత ప్రభుత్వం కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న రూపాయి నోటు ముద్రించడానికి ఆర్‌బీఐ రూ. 1.14 పైసలను ఖర్చుపెడుతోంది. ఈ రూపాయి నోట్లు ప్రింటింగ్ రాజస్ధాన్‌లోని నాథ్‌ద్వారాలో జరుగుతోంది.
సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ ప్రశ్నకు అర్‌బీఐ చెప్పిన సమాధానం ఇది. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి నోట్లను మళ్లీ చెలామణిలోకి తెస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.కొత్త రూపాయి నోటుని వందశాతం కాటన్ రాగితో తయారు చేస్తున్నారు. దీని బరువు 900 గ్రాములు. మందం 100 మైక్రాన్స్. సత్యమేవ జయతే పదాలు లేకుండా అశోక స్ధూపాన్ని నోటుపై ముద్రించారు. నోటుకు కుడి భాగంలో 'భారత్' అని హిందీలో ముద్రించింది.ఈ కొత్త రూపాయి నోటుపై కేంద్ర ఆర్ధికశాఖ కారదర్శి సంతకం ఉంటుంది. భారత్‌లో మిగతా నోట్లను ఆర్‌బీఐ గవర్నర్ సంతకంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న సంగతి తెలిసిందే.
EmoticonEmoticon