రోజూ ఒక అరటిపండు తింటే.. బరువు తగ్గొచ్చు..!





అరటిపండ్ల కంటే పసుపు పచ్చ రకం పండ్లలోనే పోషక పదార్థాలు ఎనిమిదిరెట్లు అధికంగా ఉంటాయని, రోజుకు రెండు  అరటిపండ్లు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పొందొచ్చని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెండు అరటిపండ్లు తీసుకుంటే... 90 నిమిషాల పాటు వ్యాయం చేయగల శక్తి మనకు లభిస్తుంది. అయితే... అరటిపండ్లలో అధిక పిండిపదార్థాలు ఉండడంచేత మధుమేహ వ్యాధిగ్రస్తులు వాటిని తినడం మంచిది కాదు. బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒక అరటిపండుతో సరిపెట్టుకోవడం మంచిది. అరటిలోని బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ట్రిప్టాన్‌లనే ప్రోటీన్లు కొన్ని రసాయన చర్యల త్వారా సంతోషాన్నిచ్చే సెరటోనిన్ హార్మోన్‌గా మారుతాయి. తద్వారా మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. అరటిలోని ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. శరీరంలో అరటిపండు ఎంత పడితే అంత క్యాన్సర్ నిరోధక గుణాలు అధికమవుతాయి.
Previous
Next Post »