సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ణ, హోమాదుల్లోను, కొన్ని శుభ కార్యాల్లోను కొబ్బరి కాయను కొట్టడం తప్పని సరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడేతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరి కాయే.
కొబ్బరికాయ అంటె మానవ శరీరం. బొండం పైనున్న చర్మం, మన చర్మం.. పీచు మన లోని మాంసము, పెంకె ఎముకే, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం... కాయపైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు.
EmoticonEmoticon