గుండె పోటా? త్వరగా కోలుకోండి!






గుండె పోటు శరీరాన్ని కుంగదీస్తుంది. శరీరం తీవ్ర ఒత్తిడిని, మనసు ఎంతో నిరాశా నిస్పృహలను పొందుతాయి. మళ్ళీ కోలుకోవాలంటే మరి సుదీర్ఘ ప్రక్రియే. కోలుకోడానికి జీవనశైలి పూర్తిగా మార్చాలి. సవ్యమైన జీవనశైలి ఆచరిస్తే, ఎంతో కొంత త్వరగా శరీరాన్ని కోలుకొనేలా చేస్తుంది.

హార్ట్ ఎటాక్ లనుండి త్వరగా కోలుకోడానికిగాను దిగువ చర్యలు పాటించండి.

1. ఆహారం - ఎంజైములు కల పచ్చి కూరలు, పండ్లు, సాధారణ కూరగాయలు మొదలైనవి బేడ్ కొల్లస్ట్రాల్ తగ్గించి సమస్యను పరిష్కరిస్తాయి. చేప ఆహారంలో వున్న ఒమేగా 3 గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

2. పొగతాగడం ఆపండి - గుండెకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగాలంటే పొగ తాగటం నిలిపివేయాలి. తక్షణమే స్మాకింగ్ నిలిపివేయండి. ఈ చర్య త్వరగా రికవర్ అయ్యేటందుకు తోడ్పడుతుంది.

3. బరువును తగ్గించుకోండి. తినే ఆహారంలో కేలరీలు తక్కువ వుండేలా చూడండి. అధిక బరువు తగ్గించడం గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

4. వ్యాయామం - గుండె ఆరోగ్యానికి వ్యాయామమెంతో మేలు చేస్తుంది. అయితే, వ్యాయామం వలన మరోసారి గుండెకు ఒత్తిడి లేకుండా చూడండి. ఏ వ్యాయామం చేసినా 20 నిమిషాలకు మించి చేయవద్దు. నడక, లేదా ఇతర చిన్నపాటి వ్యాయామాలు త్వరగా కోలుకోడానికి అనుకూలిస్తాయి.

ఈ నాలుగు అంశాలూ పాటిస్తే గుండెపోటు ఎదుర్కొన్న వారు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెపుతున్నారు. వీటితోపాటు ఎప్పటికపుడు బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకోవడం, డయాబెటీస్ నియంత్రించడం, శరీర జీర్ణ వ్యవస్ధ సక్రమంగా పనిచేసేలా చూడటం కూడా ప్రధానంగా చెప్పవచ్చు.

Disclaimer :: This Post is Educational Purpose Only you  can consult your doctor to clarify further doubts
Previous
Next Post »