ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?




మన ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు కొంత తేడా ఉంది. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు సుమారు 230 వోల్టుల విద్యుత్‌ శకం ఉన్న ఆల్టర్నేటింగ్‌ కరెంటు(ఎసి) తరహా విద్యుత్‌లో నడుస్తాయి.

 రైళ్ళు స్టేషన్‌లో ఆగి ఉన్నా లోపలున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఫ్యాన్లు తిరగాలి కాబట్టి బ్యాటరీల ద్వారా నడిచే ప్రత్యక్ష విద్యుత్‌(డైరెక్ట్‌ కరెంట్‌లో నడిచేలా ఉంటాయి. వీటిని మోటార్లు నడిపిస్తాయి
రైలు పెట్టెల కింద చాలా బ్యాటరీలు శ్రేణిలో కలిపి ఉంటాయి. రైలు నడుస్తున్నప్పుడు ఇరుసులకు సంధానించుకున్న విద్యుదుత్పత్తి సాధనాలు లేదా డైనమోలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా ఆ విద్యుత్‌తో ఎప్పటికప్పుడు బ్యాటరీలను చార్జ్‌ చేస్తారు.

 లైట్లు కూడా ఇదే బ్యాటరీల విద్యుత్‌తో నడుస్తాయి. ఆధునిక రైళ్లలో లెడ్‌ స్టోరేజి బ్యాటరీలకు బదులుగా ఘనస్థితి బ్యాటరీలను వాడుతున్నారు.
Previous
Next Post »