తిమింగలం నీరెందుకు చిమ్ముతుంది?






తిమింగలాలు నీళ్ళ పైకి వచ్చి పెద్ద చప్పుడు తో ముక్కుతోటి నీళ్ళను ఫౌంటైన్ లా చిమ్ముతుంటాయి ... వీటిని వేటాదేందుకు పడవలలో వెళ్ళిన వేటగాళ్ళు ఆ ఫౌంటైన్ ను చూసి ఆ చప్పుడు విని గుర్తుపడతారు . తిమింగలము చేపకాదు ... అది క్షేరద జాతి జంతువు , గుడ్లు పెట్టదు .. పిల్లల్ని కానీ వాటికి పాలిచ్చి కొంత కాలం పాటు వాటిని దగ్గరగా ఉంచుకొని సంరక్షణ చేస్తుంది . ఇవి నీళ్ళలో మునిగినపుడు వాటి ముక్కు రంధ్రాల తలుపులు ముసుకుంటాయి . .. నోటినుండి గాలివీల్లె మార్గాలు కుడా ముసుకుపోతాయి .ఈ విదంగా ఉపిరితిట్టులలోకి నీరు వెళ్ళకుండా ఏర్పాటైంది . ఇవి 5 నుంచి 10 నిముషాల కోకసారి గాలి పీల్చుకోవడానికి నీటి పైకి వస్తుంటాయి . అవసరమైతే 45 నిముశాలవరకు నీళ్ళలో మునిగి ఉండే శక్తి వాటికి ఉన్నాది . పీల్చుకున్న గాలిని ప్రాణవాయువు అయిపోయాక నీటి పైకి వచ్చి శబ్దం తో ఉపిరి వదులుతుంది ... అప్పుడు బయటికి వచ్చే గాలితో పాటు దాని ఉపిరితిత్తుల నుంచి వేడెక్కిన నీటి ఆవిరి కుడా బయటకు వచ్చి .. బయట చల్లదనం వల్ల సన్నని నీటి తుంపరలు గా మారి ఫౌంటైన్ లా కనిపిస్తుంది . అంతే కాని అది ఉపిరి గొట్టంలోకి నీళ్లు పీల్చుకొని చిమ్మడు . నీళ్లు ఉపిరి గోత్తంలలోకి వెళితే అది ఇక్కిరి బిక్కిరి అవుతుంది . నీటి మట్టానికి కాస్త దిగువన వూపిరి విదిచినట్లయితే గాలితో పాటు నీల్లుకుడా చిమ్ముతాయి .
Previous
Next Post »