వ్యక్తిగత బలహీనతలను దూరంగా ఉంచండి



వర్కింగ్ ఉమెన్స్ తొలి అడుగునుంచే అప్రమత్తతను అలవాటు చేసుకోండి. సమయపాలన చాలా అవసరం. ప్రతి పనినీ వేలెత్తి చూపించేవారితో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు నిస్పృహకి లోనవకుండా ఉండాలంటే ముందుగానే తగిన సమాధానాలు సిద్ధం చేసి ఉంచుకుని మృదువుగా తిప్పి కొట్టండి. ఉద్యోగం సంపాదించడంతోనే మనలో ప్రతిభ గుర్తింపు లభించినట్టు కాదనే విషయం గుర్తుంచుకోండి.

కుటుంబసభ్యులు, రకరకాల మనసత్త్వాలతో కూడిన వ్యక్తులతో కలిసి పనిచేయగలగడం మరో ఎత్తు. కాబట్టి ఏవైనా ఇంటి సమస్యలుంటే ఆఫీసుకు బయలుదేరే ముందు వాటిని ఇంటి దగ్గరే కొక్కానికి తగిలించి వచ్చేయండి. సక్రమమైన నియంత్రణ విధానాన్ని మనసుకి నూరిపోసి ఆఫీసులోకి అడుగుపెట్టండి. వ్యక్తిగత బలహీనతలు మరొకరు అలుసుగా తీసుకునే అవకాశాలున్నందున జాగ్రత్తగా నడుచుకోండి. ఉద్యోగ బాధ్యతలను మోసే సమయంలో ఇతరుల మన సత్త్వానికి అనుగుణంగా మిమ్మల్ని మలచుకుని వారికి అనుగుణంగా ప్రవర్తించండి.
మీరు పనిచేసేచోట వాతావరణం ఉల్లాసంగా ఉండేందుకు దోహదపడేలా మీ ప్రవర్తనను మార్చుకోండి. ఉన్నత అధికారుల గురించి బహిరంగ చర్చలు చేయకండి. దీన్ని అవకాశంగా తీసుకుని మీ సమస్యని మరింత జటిలం చేసే అవకాశముంది. ఇబ్బంది అనిపించిన విషయాన్ని మీరే మీ బాస్‌తో ముఖాముఖిగా చర్చించండి. అంకితభావంతో పనిచేసి మీ నైపుణ్యం ప్రదర్శంచండి. మీ చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలు కొనసాగించాలంటే హాస్యంగా మాట్లాడటం ఒక పెద్ద ఆకర్షణగా ఉపయోగపడుతుంది. 
Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng