మన శరీరంలో అతిపెద్ద అవయవం కాలేయం..! లివర్ పెద్ద అవయవమే కాదు, ప్రత్యేకమైనది కూడా! శరీరంలో 50కి పైగా పనుల్ని నిర్వర్తిస్తోంది. వెయ్యికి పైగా ఎంజైమ్స్‌ని లివర్ తయారు చేస్తుంటుంది. శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు రక్తం కారిపోతోందంటే అందుకు అవసరమైన ఎంజైమ్స్‌ని లివర్ ఉత్పత్తిచేస్తుంది.
అనారోగ్యాలు కలిగినప్పుడు, వాటినుంచి తట్టుకోవడానికి అవసరమైన ‘యాంటిబాడీస్‌ని’ లివర్ ఉత్పత్తి చేస్తుంది. లివర్ కొంత మేరకు గాయపడ్డా తిరిగి తన పూర్వస్థితికి చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మన శరీర అవయవాలన్నింటిలోనూ మూడింట రెండు వంతులు తొలగించినా... మళ్లీ మునపటిలా పెరగగల సామర్థ్యం కాలేయానికి ఉంది. అందుకే దాదాపు 90 శాతం కాలేయం దెబ్బతిన్నప్పటికీ ఒక పట్టాన లక్షణాలు బయటకు కనిపించవు.
మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ని ఉత్పత్తి చేయడం, విటమిన్లు- ఐరన్ వంటి పోషకాలను నిల్వచేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ని ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను లివర్ నిర్వహిస్తుంది.
కాలేయ సమస్యలకు ముఖ్య కారణాలు:
ఇన్ఫెక్షన్స్ మత్తు పదార్థాలు సేవించడం, పొగతాగడం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం శరీరానికి వ్యాయామం ఇవ్వకపోవడం కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం రక్తమార్పిడి శరీరానికి హాని చేసే మందులను ఎక్కువ మోతాదులో వాడటం ఆటో ఇమ్యూన్ డిసీజెస్... అంటే మన రోగనిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేయడానికి అవకాశం ఉన్న వ్యాధులు రావడం, వీటితో పాటు వంశపారంపర్యంగా కూడా కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణ సమస్యల్లో గుర్తించలేవిని కూడా ఉంటాయి.
మద్యపానం ఒక్కటే లివర్ డ్యామేజ్‌కు కారణం కాదు. మద్యం తాగము కాబట్టి మాకు లివర్ డ్యామేజ్ సమస్యలు ఏం ఉండవనుకోవడం చాలా పొరపాటు. కొన్ని సార్లు మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల కాలేయం చుట్టూ అధికంగా కొవ్వు చేరుతుంది.
దీన్ని ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అంటారు. అంతే కాదు దీన్ని లివర్ డ్యామేజ్‌గా కూడా వర్గీకరిస్తారు. కాబట్టి ఎటువంటి సంకేతాలు లేకుండా లివర్ డ్యామేజ్ అవుతూ, సడన్‌గా బయటపడుతుంటాయి.
లివర్‌సు హాని చేసే కొన్ని లక్షణాలు..
నోటి దుర్వాసన:
లివర్ సరిగ్గా పనిచేయకపోతే, నోటి నుండి కుళ్ళిన చేపలు లేదా కుళ్ళిన ఉల్లిపాయలు వంటి వాసన వెలువడుతుంది. అందుకు కారణం శరీరంలో అమ్మోనియ ఉత్పత్తి ఎక్కువ కావడం వల్లే.
అలసిన కళ్ళు, కళ్ళ చుట్టు నల్లటి వలయాలు:
కాలేయం చర్మాన్ని దెబ్బతీసి, అలసటకు గురిచేస్తుంది. కళ్ళ కింది చర్మం చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అలసినట్లు కనిపించినా అది మీ అనారోగ్యానికి గురి చేస్తున్నట్లుగా గుర్తించాలి.
జీర్ణక్రియ మీద ప్రభావం:
కాలేయంపై కొవ్వు పేరుకుపోయినా, లేదా కాలేయం పెద్దగా మారినా... నీరు కూడా జీర్ణం కాలేవు. అయితే చాలా కాలం నుండి చిన్న జీర్ణ సమస్యలు ఉన్నా, తగ్గకుండా తరచూ బాధిస్తుంటే లివర్ డ్యామేజ్ లక్షణంగా గుర్తించాలి.
ప్యాచ్ స్కిన్:
కాలేయం సరిగా లేనప్పుడు చర్మం రంగులో మార్పు వస్తుంది. కొన్ని సార్లు చర్మం రంగు కోల్పోతుంది. దాంతో పాటు చర్మం మీద తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. వాటిని వైట్ ప్యాచెస్ అని లివర్ స్పాట్స్ అని పిలుస్తుంటారు.
డార్క్ కలర్ యూరిన్:
కాలేయ సమస్యలు ఉన్నప్పుడు మూత్రం ముదురు ఊదా రంగులోకి మారుతుంది. ఇలా ఏదో ఒక సందర్భంలో జరిగితే అది డీహైడ్రేషన్ వల్ల అని భావించవచ్చు. కానీ ప్రతి రోజూ ఇలాగే కొనసాగితే లివర్ డ్యామేజ్ అయినట్లు గుర్తుంచుకొని వైద్యున్ని సంప్రదించాలి.
పసుపు పచ్చ కళ్ళు:
తెల్లగా ఉండే కళ్ళు పసుపు పచ్చగా, గోళ్ళు పసుపుగా మారినప్పుడు కామెర్లు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి. దానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
నోరు చేదుగా మారడం:
కాలేయం చేదుగా అనిపించే పిత్త అనే ఎంజైమును ఉత్పత్తి చేస్తుంది. అది నోటిలో చేదుగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక రకమైన లివర్ సమస్యగా గుర్తించాలి.
ఉదరపు వాపు:
కొన్ని సార్లు, కాలేయం ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఎన్ లార్డ్ కావడం వల్ల పొట్ట ఉదర భాగం ఉబ్బి ఉంటుంది. ఈ పరిస్థితిని వెంటనే గమనించకపోయినట్లైతే మీ బొడ్డు చుట్టూ పొట్ట మరింత పెరిగే అవకాశం ఉంది.
EmoticonEmoticon