పిల్లలకు నేర్పించాల్సినవి..




తల్లితండ్రులు, పిల్లలకు ఈ ప్రపంచంలో జీవించేందుకు ఎన్నో జీవిత పాఠాలు బోధిస్తారు. ఈ పాఠాలు వారు తమ వ్యక్తిగత అనుభవాలతో చెప్పేవే. మీరూ.. మీ పిల్లలకు అటువంటి జీవిత పాఠాలు బోధించాలనుకుంటే, ఆ పని పిల్లల చిన్నతనం నుంచే మొదలుపెట్టండి.



పిల్లలు చాలా విషయాలను పెద్దల్ని అనుకరిస్తూ తెలుసుకుంటారు. అందుకని తల్లితండ్రులు వాళ్లకి ఆదర్శప్రాయంగా ఉండి వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. అవి జీవితంలో మీ పెంపకాన్ని గుర్తిచేస్తాయి.

రోజూ నిద్రలేచిన తరువాత, రాత్రి పడుకోబోయే ముందు పళ్లను శుభ్రంగా తోముకోవడాన్ని అలవాటు చేయాలి. పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఆహారపు అలవాట్లను క్రమేపీ అభివృద్ధి చేయాలి.

పాలు తాగేటప్పుడూ, ఏదైనా తినేటప్పుడూ ఏవో ఆంక్షలు పెట్టి వారిని వారించకూడదు.

అతిధుల ముందు ఎలా ప్రవర్తించాలో చెప్పండి.

భోజనం చేసేటప్పుడు నేలమీద కాని, టేబుల్ మీద గాని జాగ్రత్తగా కూర్చోవాలో నేర్పించండి.

స్వీట్స్, ఐస్‌క్రీమ్‌లూ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ వారి ఆరోగ్యానికి మంచివి కావు. పిల్లలు తీపిపదార్థాల్ని ఎంత తక్కువగా తింటే అంతమంచిది. వీలైంనంత వరకూ ఇంట్లో తయారైన వాటినే తినేలా అలవరచాలి. పప్పు, ఆకుకూరల్లాంటి హెల్దీ ఫుడ్‌ని  ఎక్కువగా ఇవ్వండి.

చిరుతిళ్లకి దూరంగా ఉంచండి. తింటే వ్యాధులొస్తాయని, వాటి వల్ల ఎదుర్కొనే ప్రమాదాలేమిటో నచ్చచెప్పాలి.

ఏ సీజన్‌లో దొరికే పళ్లు ఆ సీజన్‌లో తినడం ఆరోగ్యదాయకం. పండ్లు ఎక్కువగా తినే అలవాటు చేయండి.

ఆహారాన్ని మెత్తగా నమిలమని చెప్పాలి. పాలను కూడా నెమ్మదిగానే తాగమనండి.

పిల్లలు ఒక్కొక్కసారి చాలా అల్లరి చేస్తారు. పెద్దలకు చిరాకు కలిగినా, వారిని తిట్టి కొట్టకూడదు. కారణమేదో తెలిసికొని వారిని మెల్లగానే మందలించాలి.

పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతున్నామనుకొని కొందరు తరచు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతీ చిన్న విషయానికీ దండించకూడదు. అలాంటి పిల్లలు అమాయకులుగా తయారవుతారు.

vఒకే ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్నప్పుడు వారి మధ్య తగాదాలు రావడం సహజం. తల్లిదండ్రులు వాళ్లని బుజ్జగిస్తూ, వారితో విడివిడిగా కొంచెంసేపు గడుపుతూ ఉండాలి. వారి మధ్య స్నేహభావం పెరిగేలా చూడాలి.

పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి.

ఎలక్ట్రిక్ పనులను పిల్లలకు చెప్పకండి. కరెంట్ వస్తువుల దగ్గరకు పోనీయకండి.

నాణాలను, చిన్నచిన్న వస్తువుల్నీ చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచకండి. వాటిని మింగే ప్రమాదముంది.

పిల్లల్ని సరైన సమయానికి స్కూలుకు పంపి, స్కూలు అయిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చేటట్లు చూడాలి. రోడ్‌మీద నడిచేటప్పుడు ఫుట్‌పాత్ మీదనే నడవాలనీ, అక్కడ పరుగులు పెట్టకూడదని జరగబోయే ప్రమాదాలను హెచ్చరించండి.

యూనిఫామ్, షూస్, టై వేసుకోవడాన్ని పిల్లలు ఎవరికివారే చేసుకొనేటట్లు నేర్పించండి. తల్లిదండ్రులకి కొంత శ్రమ తగ్గుతుంది. వారికి కూడా తమ పనులు తాము చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసం వస్తుంది.
Previous
Next Post »