కోడిగుడ్డు, పొట్లకాయ కలిపి ఎందుకు తిన‌కోడ‌దంటే...!




మనం రెండు పదార్థాలు కలిపి ఆహారంగా తీసుకునేటప్పుడు రెండూ ఒకే విధంగా, ఒకే సమయంలో జీర్ణమయ్యేలా ఉండాలి. అలాకాకుండా ఒకటి త్వరగా జీర్ణమై, రెండోది నిదానంగా అయితే జీర్ణ సమస్యలు మొదలవుతాయి. తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకపోతే, వ్యాధి కారకమైన ఆమ్లాలు తయారై, అనారోగ్యాలు వస్తాయి. పొట్లకాయలో నీటిశాతం ఎక్కువ కాబట్టి తేలిగ్గా అరిగిపోతుంది. కోడిగుడ్డులో మాంసకృత్తులు ఎక్కువ. దాంతో ఆలస్యంగా జీర్ణమవుతుంది. అలాంటప్పుడు రెండింటినీ కలపడం వల్ల అరిగే సమయంలో తేడాలొస్తాయి. దీంతో ఆమ్లాలు తయారయ్యే అవకాశాలెక్కువ. ఆ ఆమ్లాలు జీర్ణాశయంలో పేరుకొంటే వ్యాధులు వస్తాయి. అందుకే వద్దంటారు.
Previous
Next Post »