పిల్లలు పక్క తడిపేస్తున్నారా?






పిల్లలకు అయిదు సంవత్సరాలు వచ్చే వరకు పక్క తడుపుతుంటారు. అప్పటి దాకా మూత్రాన్ని అదుపు చేసే పట్టు లేక అలాగే ఎక్కడ పడితే అక్కడ చిన్న పిల్లల మాదిరిగానే యూరిన్ చేసేస్తారు. అయిదు సంవత్సరాల తర్వాత వారికి శరీరంలోని మలినాలను గ్రహించి అదుపు చేయగలిగే పట్టు వస్తుంది. అప్పటి దాకా ఆ సమస్యను భరించాల్సిందే తప్పదు. కానీ కొంత మంది పిల్లల్లో మాత్రం వయసు దాటినా పక్క తడిపే అలవాటు ఉంటుంది. అలాంటి వారికి మూత్రాశయం, మూత్రనాళ  ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు.

అశ్రద్ధ చేయకుండా వైద్యనిపుణులను అలాగే యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించి తెలుసుకోవాలి. వాళ్ల మూత్రనాళ వ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో చూస్తారు. పిల్లలకు ఐదేళ్ల వయసునుంచి పక్క తడపరు. ఒకవేళ అయిదు  దాటిన తర్వాత కూడా నిద్రలో మూత్ర విసర్జన చేస్తున్నారంటే వారికి మూత్రాశయం నియంత్రణలో లేనట్లే.. దీన్ని వైద్య పరిభాషలో ‘ప్రైమరీ ఎన్యూరిసిస్’ అంటారు. మామూలుగా అయితే ఐదు సంవత్సరాలకు మూత్రాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి వస్తుంది.





సాధారణ వయసు దాటిన తరువాత తిరిగి అదే సమస్య ఎదురైతే దీన్ని ‘సెకండరీ ఎన్యూరియస్’ అంటారు. శారీరక, మానసిక కారణాల వల్ల పిల్లలు పక్క తడుపుతుంటారు. కాబట్టి శారీరక సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆందోళన, మానసిక వ్యాకులత, ఇంట్లో, స్కూల్లో సమస్యలు, కలతలు.. వంటి మానసిక సమస్యలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. ఈ సమస్య ఉన్న పిల్లల తల్లిదండ్రులు చాలా ఓపికగా ఉండాలి.

పక్క తడిపే పిల్లలను తిట్టడం, కొట్టడం వెక్కిరించడం వంటివి చేయకూడదు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. పిల్లలకు రాత్రి ఏడుగంటలలోపు నీళ్లు తాగించాలి. పడుకునేటప్పుడు నీళ్లు తాగనివ్వకూడదు. పడుకునేముందు పిల్లలను తప్పనిసరిగా బాత్రూమ్‌కి పంపించాలి. మధ్య మధ్యలో మెలుకువ వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు ఓపిగ్గా వారిని బాత్రూమ్‌కి తీసుకెళ్లాలి. పిల్లల బిహేవియర్‌ను మాడిఫికేషన్ చేయాలి. మరొకటి బ్లాడర్ ట్రైనింగ్ పద్ధతి. ఇందులో మూత్రాన్ని నియంత్రించుకునే పద్ధతిని నేర్పిస్తారు.
Previous
Next Post »