మన సంప్రదాయంలో ప్రతీతత్వాన్ని ఒక స్వరూపంగా ఆరాధిస్తాం. ‘చదువు’ను సరస్వతిదేవిగా, ధనాన్ని లక్ష్మీదేవిగా, శక్తిని పార్వతిదేవిగా భావించి పూజిస్తాం. అదే విధంగా చెట్లను (అశ్వత్థ, వేప), పాములను (సుబ్రహ్మణ్యస్వామిగా) పక్షులను (గరుత్మంతుడు), జంతువులను (కాలభైరవశునకం), గజాన్ని (వినాయకుణ్ణి), వానరాన్ని (హనుమంతుణ్ణి), గోవులను ఆరాధన భావంతో మన సంస్కృతిలో మమేకం చేసుకున్నాం. అలాగే ప్రకృతిలోని కొన్ని తత్తాలను గ్రామదేవతలుగా ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నాం.
అలాగే ప్రకృతిలోని కొన్ని తత్తాలను గ్రామదేవతలుగా ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నాం. అయితే ఈ గ్రామ దేవతలందరికీ మూలం పురాణాల్లో తెలిపిన దేవతలే. జానపదులు వీళ్లచుట్టూ రకరకాల గాథలు కల్పించినప్పటికీ ఈ దేవతల స్వరూపం మాత్రం శాస్త్రాల్లో చెప్పినవే. గ్రామదేవతల్లో ఎక్కువుగా ‘దేవీ స్వరూపం’ కనబడుతోంది. ఉదాహరణకు : ఎల్లమ్మ అనే గ్రామదేవత పేరు ఎలా వచ్చిందంటే ఎల్ల అంటే అంతటా వ్యాపించింది కాబట్టి ఎల్లమ్మ అనే పేరు వచ్చింది.
అలాగే పోలేరమ్మ - పాలన చేసే అమ్మ, మైసమ్మ - మహిషాసురమర్ధిని అయినందున, ఈదమ్మ- మొదటి అమ్మ అని అర్ధం, బాలమ్మ - బాలత్రిపుర సుందరిఅని, ఐలమ్మ - ఏలే అమ్మ అని, అలాగే బోనం అనే పదం భోజనం నుండి వచ్చింది. ఈ గ్రామదేవతలు మన సంస్కృతిలో అంతర్భాగమే. అగమశాస్త్ర నియమాలు, అర్చనాది విధులు జానపదులకు తెలియనందున పూర్వం ఈ దేవతల్ని ఏర్పాటు చేసుకొని ఆరాధించారు.
2 Comments
Write Commentsకాలక్షేపమునకు చాలాచక్కగా పనికి వస్తుంది.ఈ తరం సగటు మానవులకు మంచిటైంపాస్
Replyసరదాగా కాలక్షేపానికి మంచి అవకాశం కలదిక్కడ
ReplyEmoticonEmoticon