ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి.
ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి.
పొరపాటున మంగళసూత్రం పెరిగితే వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు, ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు, ఆధారమని అని అర్థం. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు.
నలుపు, బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతిదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా, వధువు సుమంగళిగా ఉండాలని పార్వతీపరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
2 Comments
Write Comments>> మంగళసూత్రం తెగిపోతే
Replyమంగళసూత్రం పెరిగితే అనండి. (తెగటం అన్న మాట ఇక్కడ వాడరు దానికి బదులు పెరగటం అంటారు సంప్రదాయికంగా.)
Ok Sir
ReplyEmoticonEmoticon