సీతమ్మ ఆంజనేయుడికి చెప్పిన కార్యసిద్ధి మంత్రం


 


సీతమ్మ హనుమంతునితో చెప్పిన మాట ఒక కార్యసిద్ధి మంత్రంగా వ్యాప్తి చెందింది.


త్వమస్మిన్ కార్య నిర్యోగే
ప్రమాణం హరిసత్తమ!
హనుమాన్ యత్నమాస్థాయ
దుఃఖక్షయకరో భవ!!


ఇది చాలా ప్రసిద్ధి మంత్రం.


ఈ మాటను సీతమ్మ సాక్షాత్ ఆంజనేయ స్వామితో అంది. ఈ పని చేయడంలో తగినవాడవు నువ్వే. అందుకు హనుమా! సరైన ప్రయత్నం నువ్వే చేసి నా యొక్క దుఃఖాన్ని పోగొట్టు అని సీతమ్మ అన్నది. సీతమ్మ అనే ఈ మాటను ఎవరైనా పఠిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఇంకా దుఃఖాలు తొలగిపోతాయి.



ఈ మంత్రాన్ని మంగళవారం లేదా శనివారం పూట పఠించడం ప్రారంభించాలి. ముఖ్యంగా శనివారం పూట సంధ్యాసమయంలో శుచిగా స్నానమాచరించి హనుమాన్ ఆలయాన్ని సందర్శించుకుని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించాలి.




ఈ మంత్రాన్ని 1110 సార్లు.. 40రోజుల పాటు పఠిస్తే మీరుకు అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ మంత్ర పఠనం ద్వారా శత్రుభయం తొలగిపోతుంది.

Previous
Next Post »