జుట్టు సమస్యలకి చెక్ చెప్పేయండీ.




ముఖం అందాన్ని పెంచడంలో శీరోజాల పాత్ర పెద్దదే. కానీ వయసు పెరిగేకొద్దీ, ఒత్తిళ్లు ఎక్కువయ్యేకొద్దీ జుట్టు రాలిపోయి టెన్షన్ పెడుతూ ఉంటుంది. రోజూ వంద వెంట్రుకల దాకా కోల్పోతూ ఉండడం సహజమేనని నిపుణులు చెబుతుంటారు. 

కాబట్టి తల దువ్వుకున్నప్పుడు నాలుగు వెంట్రుకలు రాలిపోయాయని కంగారుపడిపోవాల్సిన అవసరం లేదు. మరీ పెద్దమొత్తంలో ఊడిపోయినప్పుడు మాత్రమే టెన్షన్ పడాలి. అసలు అలాంటి సమస్యే రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో మూడు పోషకాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.




ఐరన్ -

ఆహారంలో దీని పాత్ర ఎక్కువ ఉంటే జుట్టు గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎగ్స్, నట్స్, డ్రైఫ్రూట్స్, సీఫుడ్, మటన్, లివర్ వంటి వాటితో పాటు ఆకుకూర్లలో విరివిగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

సి-విటమిన్

బత్తాయి, నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ ఫ్రూట్స్‌లో సి-విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ సి-విటమిన్ సహాయపడుతుంది.

జింక్

ఇది కూడా జుట్టుకి చాలా అవసరం. హెయిర్ బలంగా పెరగాలన్నా, కాంతివంతంగా ఉండాలన్నా ఇందుకు జింక్ అవసరం. అందుకే జింక్ ఎక్కువ ఉండే ఆహారాలను తీసుకోవాలి. గుమ్మడి గింజలు, సీఫుడ్, డార్క్ చాక్లెట్, మటన్, వేరుశనగలు, పుచ్చకాయ గింజల్లో జింక్ శాతం ఎక్కువ. అందుకే ఇవి ఎక్కువ తింటే హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి చింత అవసరం ఉండదు.


వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ, జుట్టుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే శిరోజాల సోయగాలు పెరుగుతూనే ఉంటాయి. ఇన్ని  జాగ్రత్తలు తీసుకున్నా కూడా హెయిర్ డ్యామేజ్, హెయిర్ ఫాల్ ఎక్కువున్నా అందుకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందేమో టెస్ట్ చేయించుకోవడం మంచిది.


Previous
Next Post »