ఫ్యాషన్ అంటేనే లేని దాన్ని క్రియేట్ చేయడం, ఉన్న అందాన్ని రెట్టింపు చేయడం. అందులో భాగమే ఈ టాజిల్స్. ఫ్యాషన్‌కు అలవాటు పడ్డ వారికి ప్రతీదీ ఫ్యాషన్‌గానే ఉండాలనుకుంటారు. అందుకే పుట్టుకొచ్చే ప్రతి కొత్తందాన్ని ప్రయత్నిస్తుంటారు చాలామంది. అలాంటి ఈ కుచ్చుల ఫ్యాషన్ కూడా.
లెహంగా, కుర్తీ, స్కార్ఫ్, టాప్, క్రాప్‌టాప్ ఇలా ఎంచుకునే ప్రతీ దానిలోనూ కొత్త దనం కనిపించాలంటే వాటన్నింటిలోనూ టాజిల్స్ ఉండేలా చూసుకోవాలి. మరి అవి ఎలా ఉంటాయో, వాటి లుక్ బాగుంటుందో లేదో ఒకసారి చూసేసి, ఆలస్యం చేయకుండా కొనేసెయ్యండి..
కుచ్చులను ఇప్పుడు టాజిల్స్ అంటున్నారు. ఇదే ఇప్పటి ట్రెండ్. కుచ్చులు అనగానే పట్టుచీర చెంగు అంచుల్లో వేలాడే కుచ్చులే గుర్తొస్తాయి కదా! కానీ కాదు.. ఇదంతా ఒకప్పటిమాటగానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ కుచ్చులే అని రకాల దుస్తుల డిజైన్లకు ఎక్స్‌ట్రా అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. సంప్రదాయ దుస్తులతోపాటు పాశ్చాత్య దుస్తుల్లోనూ ఈ టాజిల్స్ మెరిపిస్తున్నాయి.
ఇది వరకు పట్టు చీరలకు మాత్రమే ఉండే ఈ టాజిల్స్ ఇప్పుడు ట్రెండ్‌లో భాగంగా నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా వీటి అందాలే. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఈ కుచ్చులు వస్త్ర ధారణ భలే నప్పుతుంది.
క్రాప్‌టాప్స్, లెహెంగాలు, స్కర్టులు, గౌన్లు, అనార్కలీ, గాగ్రా... ఇలా ఒకటేమిటి అన్నింటా టాజిల్స్ రంగురంగుల్లో మురిపిస్తున్నాయి.
మామూలు వస్త్రాలకు కూడా టాజిల్స్ కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. చేతుల అంచుల్లో, భుజాల దగ్గరా కుచ్చులను వేలాడేట్లు చేయడం వల్ల స్టైలిష్‌గా కనిపిస్తారు.
ఒకప్పుడు చీరకొంగు దగ్గర దారాలను ముడివేసి కుచ్చులుగా వేలాడదీసేవారు. ఇప్పుడు చీరంతా కూడా చక్కగా కుచ్చులను జర్దోసీ వర్కుతో డిజైన్ చేస్తున్నారు.
పట్టుచీరలకైతే వెండి, బంగారు జరీలతో చేయించడం వల్ల చీరకు రిచ్ లుక్ వస్తోంది.
టాజిల్స్‌ని సాధారణంగా ఊలు, పట్టుదారాలతో తయారుచేస్తారు. ఆ దశ దాటి ఇప్పుడు బంగారు, వెండి పోగులతో రూపొందిస్తున్నారు.
ఫ్యాషన్ డిజైనర్లు ఇంకాస్త ట్రెండీగా ఆలోచిస్తూ మెటల్ని కూడా వీటిని తయారుచేసేందుకు వాడుతున్నారు.
మెటల్ టాజిల్స్‌ని తేలికపాటి వస్త్రరకాల్లో కాకుండా కాస్త బరువుగా ఉండే వాటిపై ఉపయోగిస్తే బాగుంటాయి. మరీ నూలు, చేనేత రకాలకైతే సిల్క్ త్రెడ్ కానీ, ఊలుతో చేసిన టాజిల్స్ అందాన్నిస్తాయి.
చీరలు, పొడవాటిగౌన్లు, మాక్సీలపై ఎంబ్రాయిడరీ బెల్టులను ఉపయోగిస్తున్నారు. వాటి అంచుల్లో కుచ్చులను వేలాడేలా చేయడం వల్ల ఆ డ్రెస్‌కు నిండుదనం వస్తుంది.
కాలేజీ అమ్మాయిలు ట్రెండీగా భావించి ఎంచుకునే పలాజోలు, డెనిమ్ ప్యాంట్లపై కూడా టాజిల్స్‌తో కొత్తగా డిజైన్లు చేయించుకోవచ్చు. ఇక కుర్తీలు, టాప్స్‌కైతే అంచుల్లో అందం అద్భుతమనిపిస్తుంది.
క్రాప్‌టాప్‌కు జతగా లెహెంగా ఉండడం ఇప్పటి ట్రెండ్. దాన్ని మరింత అందంగా కనిపించేలా చేయాలంటే బ్లౌజ్ వెనక భాగంలో టాజిల్స్‌ని జత చేయాలి.
అలాగే పట్టు పరికిణీలకూ, బార్డర్ లెహెంగాల అంచుల్లోనూ ఈ టాజిల్స్‌ను ఉపయోగించవచ్చు.
అనార్కలీలకు మెడ అంచుల్లో, యోక్ పార్ట్‌లో ఈ కుచ్చులు వచ్చేలా డిజైన్ చేసుకోవచ్చు. ముదురు రంగు దుస్తులకు కాంట్రాస్ట్ రంగుల్లో ఈ కుచ్చులను ఎంచుకుంటే ట్రెండీగా కనిపించవచ్చు.
పెళ్లికూతురుకి టాజిల్స్‌ను ఎంచుకోవాలంటే దుపట్టా అంచుల్లో, పరికిణీల ఫినిషింగ్ కోసం, జాకెట్ దగ్గరా ఎంచుకుంటే అందంగా బాగుంటుంది.
ఇప్పుడు టాజిల్ స్కార్ఫ్ కూడా ఫ్యాషన్ అయిపోయింది. టాప్స్‌పైన, కుర్తీలపైన కానీ చున్నీ బదులు టాజిల్ స్కార్ఫ్స్‌నే ఎక్కువగా వాడుతున్నారు అమ్మాయిలు. అయితే ఈ స్కార్ఫ్స్‌ని ఎంచుకునేటప్పుడు కుర్తీ, టాప్ ప్లెయిగా ఉండేలా చూసుకుంటే స్కార్ఫ్‌తో సూపర్ లుక్ మీ సొంతం.
EmoticonEmoticon