మండే ఎండలో తాజా.. తాజా.. కూల్.. కూల్!




శరీర దుర్వాసన అనేది మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఎండాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది. స్వేద గ్రంధులు అతిగా పనిచేసినప్పుడు ఘాటైన దుర్వాసన శరీరం నుంచి వస్తుంది. చెమటతో బాక్టీరియా కలిసినప్పుడు దుర్వాసన వస్తుంది. వాతావరణం కూడా ఇందుకు తోడవుతుంది. కెఫీన్ సంబంధిత బెవెరేజెస్, కొన్ని ప్రత్యేకమైన డ్రగ్స్, స్పైసీ ఫుడ్స్  తీసుకోవడం వంటివి కొన్ని కారణాలైతే, టైట్ బట్టలను ధరించడం, డీహైడ్రేషన్, స్ట్రెస్ ,  టెన్షన్, ఆల్కహాల్  సేవించడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం, హార్మోన్ల అసమతుల్యతలు, ప్యూబర్టీ వంటివి శరీర దుర్వాసనను కలిగించే మరికొన్ని కారణాలు. శరీరాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కొన్ని నేచురల్ రెమెడీస్‌తో ఈ సమస్యను నిర్మూలించవచ్చు.  వాటి వివరాలే ఇవి...



బేకింగ్ సోడా మిక్స్

శరీర దుర్వాసనని తగ్గించడానికి బేకింగ్ సోడా తోడ్పడుతుంది. చర్మంలోంచి మాయిశ్చర్‌ను ఇది గ్రహించి 
బాక్టీరియాను అంతమొందించి నేచురల్ డియోడ్రెంట్ లా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో నిమ్మరసాన్ని కలపండి. ఈ సొల్యూషన్ ను అండర్ ఆర్మ్స్‌కు అప్లై చేయండి. అలాగే, చెమట చిందే ఇతర బాడీ పార్ట్స్  వద్ద కూడా ఈ సొల్యూషన్ ను అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఈ పద్ధతిని కొన్ని వారాలపాటు రోజూ పాటించండి.

ఆల్కహాల్

శరీర దుర్వాసనను తగ్గించడంలో ఆల్కహాల్ అనేది ముఖ్య రెమెడీగా పనికొస్తుంది. ఇది త్వరగా ఏవాపరేట్ చేస్తుంది. తద్వారా స్మెల్‌ను తగ్గిస్తుంది. పోర్స్‌ని క్లోజ్ చేయడం ద్వారా చెమట ఉత్పత్తిని తగ్గిస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆర్మ్ పిట్స్ వద్ద కాస్తంత ఆల్కహాల్ ను అప్లై చేసి రబ్ చేయాలి. కొన్ని నిమిషాల తరువాత వాష్ చేయాలి. 

ఆపిల్ సిడర్ వెనిగర్ 

యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి బాక్టీరియా వృద్ధిని అరికడతాయి. తద్వారా చర్మంలోని పిహెచ్ లెవెల్ ను బాలన్స్ చేసి శరీర దుర్వాసనను అరికట్టడానికి తోడ్పడతాయి. ఒక కాటన్ బ్యాలెన్స్ ని ఆపిల్ సిడర్ వెనిగర్ లో కలిపి దాంతో అండర్ ఆర్మ్స్‌ని రబ్ చేయాలి. ఆ తర్వాత 2, -3 నిమిషాల పాటు ఆగాలి. తర్వాత  షవర్ తీసుకోవాలి. ఈ రెమెడీని రోజుకు రెండుసార్లు పాటించాలి. ఉదయం ఒకసారి అలాగే నిద్రపోయే ముందు ఇంకొకసారి ఇలా పాటిస్తే మీరు ఇంప్రూవ్‌మెంట్‌ను గమనించగలుగుతారు.     
         
టమాటో పల్ప్

టమాటోలో ఉండే ఎసిడిటీ అనేది దుర్వాసనను కలిగించే బాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే, టమాటో తినడం వల్ల చర్మరంధ్రాలు కుదించుకుపోతాయి. తద్వారా శరీర దుర్వాసన తగ్గుముఖం పడుతుంది. టమాటోలో నుంచి పల్ప్‌ను తీసి, దీనిని డైరెక్ట్‌గా ఆర్మ్ పిట్స్ వద్ద అప్లై చేయండి. పదిహేను నిమిషాల వరకు ఇలా ఉండనివ్వండి. ఆ తరువాత, చల్లటి నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రపరచండి. ఆశించిన ఫలితాన్ని పొందేవరకు, ఈ రెమెడీని కొన్ని వారాల పాటు ప్రయత్నించండి.

నిమ్మ

నిమ్మ అనేది శరీర దుర్వాసనను తొలగించేందుకు ఉపయోగపడే కామన్ రెమెడీ. కొన్ని తరాల నుంచి ఈ రెమెడీను పాటిస్తున్నారు. ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి. ఒక సగాన్ని తీసుకుని అండర్ ఆర్మ్స్ వద్ద రబ్ చేయండి. చర్మంలోకి జ్యూస్ ఇంకిపోయేలా చూడండి. ఈ జ్యూస్ సహజంగా ఆరేవరకు ఆగండి. ఆ తర్వాత  షవర్ తీసుకోండి. 

లెట్యూస్

శరీర దుర్వాసనను తగ్గించేందుకు లెట్యూస్  మంచి హెర్బల్ రెమెడీగా పనిచేస్తుంది. కొన్ని లెట్యూస్ లీవ్స్‌ని క్రష్ చేసి వాటినుంచి జ్యూస్‌ని సేకరించండి. ఈ జ్యూస్‌ని ఆర్మ్ పిట్స్ వద్ద రబ్ చేయండి. మంచి ఫలితం రావాలంటే స్నానం చేసిన తరువాత ఈ పద్ధతిని  పాటించండి. 

రోజ్ వాటర్

రోజ్ వాటర్ అనేది ఎంతో సూతింగ్ రెమెడీ. ఇది అండర్ ఆర్మ్ దుర్వాసనను తగ్గించేందుకు తోడ్పడుతుంది. కాస్తంత రోజ్ వాటర్ ను అండర్ ఆర్మ్స్ వద్ద అప్లై చేయండి. ఇది ప్రభావిత ప్రాంతాన్ని డియోడరైజ్ చేస్తుంది. ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే కొన్ని చుక్కల రోజ్ వాటర్ ని బాత్‌టబ్ లో యాడ్ చేస్తే రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు.
Previous
Next Post »