అందానికి మారుపేరు ముఖం. అలాంటి అందమైన ముఖంపై మొటిమలు, మచ్చలు అందవిహీనంగా కనిపిస్తే చికాకుగా అనిపిస్తుంది. ముఖాన్ని మరింత అందంగా చేస్తూ, మచ్చల్ని మాయం చేసే చిట్కాలేంటో చూసేద్దామా...
మచ్చలు మాయం..
తులసిరసం, నిమ్మరసం సమాన భాగాలుగా తీసుకొని ముఖానికి పట్టించి, అరగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖంపై ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి.
చర్మం కాంతివంతగా..
మేకపాలలో పచ్చి పసుపు, మంజిష్ట, నెయ్యి ఆవాలు కలిపి నూరి ముఖానికి, చర్మానికి రాస్తే ముఖం నిర్మలంగా, సౌందర్యంగా కనిపిస్తుంది.
మృదువై చర్మానికి..
నిమ్మరసంలో మునగాకుల రసం కలుపుకొని ప్రతిరోజు ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. మున్ముందు మచ్చలూ, మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉండదు.
మొటిమలు, మచ్చలు..
దాల్చిన చెక్క, నిమ్మరసం కలిపి బాగా నూరి ఆ ముద్దను ముఖంపై లేపంనంగా పెట్టుకొని, అరగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో కడుక్కుంటే మొటిమలు, మచ్చలు మటుమాయమౌతాయి.
ముడతలు..
రెండు చెంచాల పెరుగును, అరస్పూన్ సెనగపిండిని, చిటికెడు పసుపు, ఒక చెంచా నిమ్మరసం కలిపి ఉదయం పూట ముఖానికి పట్టించి, అరగంట ఆగి శుభ్రంగా కడుక్కుంటే కొద్ది రోజుల్లోనే ముడతలు తగ్గిపోతాయి.
ఎర్రెర్రని పెదవులకు..
గ్లిసరిన్, నిమ్మరసం రెండు చుక్కలు కలిపి రాత్రి పడుకునేటపుడు పెదవులకు రాసుకుంటే, పెదాలు ఎర్రగా మెరుస్తాయి.
EmoticonEmoticon