గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు






రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదు. అయితే ఖచ్చితంగా ఆకుపచ్చ ఆపిల్‌లో ఈ వాస్తవం ఉంది. రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో అవసరమైన పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. ఆపిల్స్‌లో చాల రకాలు ఉన్నాయి.  ఎరుపు, ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని, తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. గ్రీన్ యాపిల్ దీర్ఘకాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటి.

ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం  రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం, బీపీని తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం, ఆకలి మెరుగుపరచడం వంటి వాటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. 

గ్రీన్ ఆపిల్ ఆరోగ్య ప్రయోజనాలు

ఎక్కువ ఫైబర్ కంటెంట్ : 

దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడి తద్వారా జీవక్రియను పెంచుతుంది. ఇది పేగు స్వేచ్ఛగా  కదలాడేలా సహాయపడుతుంది. ఆపిల్‌ను తొక్క తీయకుండా తింటేనే మంచిది. పేగు, వ్యవస్థలను శుభ్రపర్చి ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడుతుంది.

ఖనిజాల కంటెంట్ 

ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం మొదలైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఆపిల్‌లో ఉన్న ఇనుము రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది.

తక్కువ కొవ్వు కంటెంట్ 

బరువు తగ్గాలని అనుకొనే వారికీ గొప్ప ఆహారంగా చెప్పవచ్చు. ఇది రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక స్ట్రోక్స్ అవకాశాలు నివారించి, గుండెకు రక్త సరఫరాని సక్రమంగా నిర్వహిస్తుంది.

చర్మ క్యాన్సర్...

దీనిలో విటమిన్ ఉండటం వల్ల చర్మ కణాలకు వచ్చే నష్టాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. అందువలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

యాంటీ ఆక్సిడంట్ సమృద్ధిగా

యాంటీ ఆక్సిడంట్‌లు, కణాల పునర్నిర్మాణం కణాల పునరుత్తేజానకి సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన చర్మానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడంట్ కాలేయాన్ని రక్షించడానికి, పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలు 

ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడం వల్ల కీళ్లవ్యాధులు రాకుండా ఉంటాయి.

అల్జీమర్ నిరోధిస్తుంది..

ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే అల్జీమర్ వంటి వృద్ధాప్య నరాల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని అడ్డుకుంటుంది.

ఆస్తమాని నిరోధిస్తుంది..

క్రమం తప్పకుండా ఆపిల్స్రం తీసుకుంటే తీవ్ర సున్నితత్వం కలిగిన అలెర్జీ రుగ్మత అయిన ఆస్తమాని నిరోధించటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

డయాబెటిస్... 

యాపిల్స్ మధుమేహాన్ని నిరోధిస్తుంది. మధుమేహ నివారణకు దీనిని తప్పక తినాలి. హానికరమైన ప్రభావం నుండి చర్మాన్ని రక్షించటానికి గ్రీన్ ఆపిల్‌లో విటమిన్ బీ, సీ,  సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక ప్రకాశించే చర్మానికి సహాయపడుతుంది.

మైగ్రేన్‌కి విరుగుడు.. 

మహిళల్లో ఒత్తిడి శాతం పెరిగిపోయి అది క్రమంగా మైగ్రేన్ తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అటువంటి మైగ్రేన్ తలనొప్పికి విరుగుడుగా ఆకుపచ్చని యాపిల్స్‌ని తింటే మైగ్రేన్ తలనొప్పిని దూరం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

గ్రీన్ ఆపిల్‌తో స్కిన్ ప్రయోజనాలు

గ్రీన్ ఆపిల్ సౌందర్యాన్ని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది. చర్మ, జుట్టు సంరక్షణ ప్రయోజనాలు గ్రీన్ ఆపిల్‌లో చాలా ఉన్నాయి. చర్మ ఛాయను పెంపొందిస్తుంది. గ్రీన్ ఆపిల్‌లో విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొటిమలను నివారిస్తుంది. గ్రీన్ ఆపిల్ సాధారణ వినియోగం వలన మొటిమలను నిరోధిస్తుంది. కళ్ళ కింద ఏర్పడే- నల్లటి వలయాలను తొలగించి, చళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

చుండ్రును నివారిస్తుంది..

గ్రీన్ ఆపిల్ చర్మం కొరకు మాత్రమే కాకుండా జుట్టు కొరకు కూడా చాలా మంచి ప్రయోజనాలను కలిగి ఉంది. గ్రీన్ ఆపిల్ ఆకులు దాని తొక్కతో కలిపి చేసిన పేస్ట్‌ని తలకు మర్ధన చేస్తే, చుండ్రు సమస్య తొలగిపోతుంది. పేస్ట్‌ను ఒక షాంపూలాగ వాడాలి. గ్రీన్ ఆపిల్ రసాన్ని జట్టుకు మసాజ్‌గా వాడితే చండ్రు సమస్య తగ్గుతుంది.

జుట్టు రాలడాన్ని అరకడుతుంది

పటిష్టమైన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. గ్రీన్ ఆపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడంట్ ఫైబర్స్ దీర్ఘకాలం పాటు చర్మాన్ని ముడతలు పడకుండా ఉంచుతుంది.

ఆపిల్... ఔషధఫలం

ఆపిల్ పోషకాల గురించి మనకు తెలిసిందే. అయితే అందులోని ఔషధగుణాలవల్ల చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చంటున్నాయి కొన్ని పరిశోధనలు...

* రోజూ కనీసం ఓ ఆపిల్ తినేవాళ్లలో మధుమేహం కూడా తక్కువే. ఆపిల్‌ని కొందరు తొక్క తీసి తింటారు. కానీ అందులోని ట్రిటర్పినాయిడ్లు కాలేయం, పేగు, రొమ్ము క్యాన్సర్ల కణాలు పెరగకుండా అడ్డుపడతాయి. ఆపిల్ జ్యూస్కి ఆల్జీమర్స్ని నిరోధించే శక్తి ఉంది. మెదడులోని ఎసిటైల్ కోలీన్ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరుని మెరుగుపరుస్తుంది.
Previous
Next Post »