గర్భిణిలు క్రమంతప్పకుండా మల్టీ విటమిన్ మాత్రలు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలల నిండకుండానే శిశువు జన్మించడం వంటి సమస్యలు దూరమవుతాయి. ఈ విషయం పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. మల్టీ విటమిన్ మాత్రలు తీసుకోవడం వల్ల శిశువు బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుందట. ‘ చాలా మందిలో నెలలు నిండకుండానే డెలివరీ అవుతుంటుంది. శిశువు బరువు కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ మైక్రోన్యూట్రియెంట్ మాత్రలతో దూరమవుతాయని మా అధ్యయనంలో తేలింది’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జాన్స్ హోప్‌కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ కీత్ వెస్ట్ అంటున్నారు. శిశువు బరువు పెరగడం వల్ల జన్మించిన తరువాత వచ్చే కొన్ని సాధారణ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అధ్యయనంలో భాగంగా 45 వేల మంది గర్భిణిలను పరిశీలించారు. వారికి మల్టీ విటమిన్ మాత్రలు, ఫోలికాసిడ్ మాత్రలు ఇచ్చి శిశువు పెరుగుదలను, ప్రెగ్నెన్సీ పీరియడ్స్‌ను గమనించారు. మల్టీ విటమిన్ మాత్రలు తీసుకోని వారితో పోల్చితే, మాత్రలు తీసుకున్న వారి శిశువులు ఎక్కువ బరువుతో జన్మించారు. సో... ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మల్టీ విటమిన్ మాత్రలను మరువద్దు.
బిడ్డ బరువు పెరగాలంటే ఎం చేయాలి

EmoticonEmoticon