మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా శరీరంలోని వివిధ అంగాలలో వచ్చే కదలికలను (ఇన్‌వాలంటరీ మూవ్‌మెంట్స్) నరాల వణుకుడు లేదా ట్రెమర్స్ అని వ్యవహరిస్తాము. చాలా తరచుగా వచ్చే వణుకుడు సమస్యలకు ముఖ్య కారణాలు పార్కిన్‌సన్స్, మల్టిపుల్ స్ల్కీరోసిస్ అనే నరాల సంబంధిత వ్యాధులు. ఇవి కాకుండా, మత్తు మందులు సేవించే వారిలోనూ, మత్తు పానీయాలకు బానిసలైన వారిలోనూ, థైరాయిడ్ వ్యాధి ఉన్న వారిలోనూ, మానసిక ఆందోళన లేదా హిస్టీరియా వ్యాధిగ్రస్తుల్లో కూడా వివిధ లక్షణాలతో ఈ నరాల వణుకుడు సమస్య కనిపిస్తుంది.
పార్కిన్‌సన్స్ వ్యాధి లేదా షేకింగ్ పాల్సీ ఒక దీర్ఘకాలిక నరాల సంబంధిత వ్యాధి. మెదడువాపు వ్యాధి వలన కాని, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ తరువాత కాని ఈ వ్యాధి రావచ్చును. ఈ వ్యాధితో బాధపడేవారి చేతుల్లో, తలలో వణుకుడు ప్రారంభమవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు వణుకుడు ఎక్కువ అవుతుంది. కదలికలో, నిద్రలో తగ్గుతుంది. ఆందోళనగా ఉన్న ప్పుడు ఎక్కువ అవుతుంది. మాట తడబడుతుంది. కండరాలలో స్పాజమ్స్ వస్తాయి.
ఏళ్ల తరబడి ఈ సమస్య కారణంగా బాధపడుతుంటారు. ఫిజియోథెరపీ కొంత వరకూ ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచగలిగితే ఈ వ్యాధిని ఏ సమస్యలు లేకుండా నియంత్రించవచ్చు. పార్కిన్‌సన్స్ కాకుండా మల్టిపుల్ స్ల్కీరోసిస్ వ్యాధిలో నరాల పైపొర దెబ్బతిని, ముఖంలో బలహీనత, కాళ్లలో బరువు, చూపు మందగించడం, మెదడుపై ప్రభావం పడినప్పుడు ఫిట్స్ రావడం, మాట సన్నగిల్లడం, నరాల వణుకుడు, తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇతరకారణాల వలన వచ్చే సమస్యను ఆయా కారణాలకు చికిత్స చేస్తే ఈ వ్యాధి త్వరితంగా నయమయ్యే అవకాశం ఉంటుంది. మత్తుమందులు, మద్యపానం వంటి వాటి వలన ఈ సమస్య ఉత్పన్నమైతే, వాటికి డీఅడిక్షన్ చికిత్స చేయడం ద్వారా వీటిని నయం చేయవచ్చు.
హోమియో చికిత్స
సరైన కాన్‌స్టిట్యూషనల్ మందులతో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా నరాల వణుకుడు సమస్యను ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా హోమియో ఔషధాలతో నియంత్రించడానికి మంచి అవకాశాలున్నాయి.
ఔషధాలు
అగారికస్ : మెదడులో పాథలాజికల్ మార్పుల వచ్చే వణుకు, కాళ్లలో పక్షవాతంలాగా నరాల బలహీనత, కండరాలు పట్టినట్లు ఉండటం, కళ్లు తిరగడం, అతిగా మాట్లాడటం, భయం లేకుండా ఉండటం తదితర లక్షణాలకు ఇది ముఖ్యమైన మందు.
క్యూప్రమ్‌మెట్ : చేతి, కాలి వేళ్లనుండి వణుకు మొదలై, పైకి పాకుతుంది. నిద్రపోతున్నప్పుడు ఉపశమనంగా ఉంటుంది. ఈ లక్షణాలున్న వారిలో ఇది బాగా పని చేస్తుంది.
టారెంటులా : కుడివైపున వణుకు ఉంటుంది. ఇది భయంతో ఎక్కువ అవుతుంది. ఆందోళనగా, చిరాకుగా ఉంటారు. వీరికి సంగీతం వింటే బాధలన్నీ ఉపశమించినట్లు ఉంటాయి.
నక్స్‌వామికా : ఆల్కహాల్‌లాంటి మత్తుపానీయాలు తీసుకునే వారిలో వచ్చే వణుకుడు సమస్యకు ఇది ముఖ్యమైన మందు. వీరికి మలబద్ధకం ఎక్కువ. జీర్ణశక్తి తక్కువ. ఇవే కాకుండా, స్ల్కీరోసిస్ ఉన్నవారిలో హయోసయామస్, ఆర్సానిక్ ఆల్బ్, జనరల్ ట్రెమర్స్‌కు ఆంటిమోనియమ్ మార్ట్, కాస్టికమ్, సిపిసిఫ్యూగా, లాకసిస్, జింకమ్‌మెట్ మొదలైన మందులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
హోమియో ఔషధాలను వాటి రోగలక్షణాలను బట్టి వైద్యపర్యవేక్షణలో ఉపయోగిస్తే వణుకుడు సమస్యను చాలా వరకూ నయం చేయడానికి అవకాశం ఉంటుంది.
EmoticonEmoticon