vara laxmi vratam lo vadavalisina samgri |
అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలు, జీవన శైలికి ఉపకరించే విలువైన పాఠాలూ ఎన్నో ఉన్నాయి. కలశం.. సృష్టికి సంకేతం. లోపల ఉన్న నీరు సమాజానికి ప్రతి రూపం. కలశ వస్త్రం..
వస్త్రం రంగు ప్రకృతికి నిదర్శనం. ఆ వస్త్రంలో అగ్ని, వరుణ, వనస్పతి, ఆదిత్య, పితృ దేవతలు, నక్షత్రాలు ఉంటారు. వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారిని పూజించడానికి వాడాల్సిన పూజా ద్రవ్యాలు..
మామిడి ఆకులు:
కొబ్బరికాయ:
వరలక్ష్మి వ్రతంలో కంకణం ఎలా చేయాలి ? ఎందుకు కట్టుకోవాలి
పసుపు కుంకుమలు:
పానకం, వడపప్పు:
పూలసేవ:
వరలక్ష్మీదేవతా మూర్తిని పూలతో పూజిస్తాం. అందుకు కలువ, మందార పూలు ప్రశస్తమైనవి. కలువ పూలకు సౌందర్యం, సౌకుమార్యం, సౌగంధం.. అనే మూడు విశేష లక్షణాలున్నాయి. ఇవి స్త్రీ తత్వాన్ని, ప్రత్యేకతను, విలువను తెలపుతాయి. కలువలది ఎంత సౌందర్యం అంటే నీటిలోంచి తీయగానే వాడిపోతాయి. ఎంత సౌకుమార్యమంటే చేత్తో తాకితేనే కందిపోతాయి. సౌగంధం అంటే పరిమళాన్నందించడం. ఏ ఇబ్బందులు లేకుండా, భర్తతో ఆనందమయ జీవితాన్ని కోరుకుంటూ అమ్మవారికి కలువ పూలతో పూజ చేయాలి. మందార పూలు వైవాహిక జీవితానికి సంకేతం. అందంగా విరిసిన నాలుగు రేకులు, పుప్పొడి కుటుంబ వ్యవస్థను ప్రతిఫలిస్తాయి. మందారం అంటేనే సంతోషం కలిగించేదని అర్థం. ఆ పూలతో పూజించడం అంటే కుటుంబ శ్రేయస్సుని కాంక్షించడమే.అష్టోత్తర శతనామాలు:
మహత్యం:
వాస్తవానికి ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీరూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతర దేవతలతో పనులు చేయిస్తుంది.
గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో కనిపెట్టుకుని, గమనించి, పాలించే శక్తి అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్టిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు.
పరమేశ్వర శక్తితో జరిగే సృష్టి స్థితి లయలే ఈక్షణ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు. సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, లక్ష్యంగా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి.
జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని భృగువారమనీ వ్యవహరిస్తారు.భృగు పుత్రికగా లక్ష్మీదేవికి భార్గవి అని దివ్యనామం. పర్వతరాజు పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణు దయనే ఆయా లోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి…ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు.
EmoticonEmoticon