మరికొన్ని రోజుల్లో చలికాలం ఆరంభం కానున్నది. ఈ సీజన్ చర్మంపై తీవ్రప్రభావాన్నే చూపుతుంది. తగిన జాగ్రత్తలు పాటించకపోతే చర్మం ముడతలతో అందహీనంగా కనిపిస్తుంది. చలి శరీరంపై తీవ్రప్రభావం చూపుతుంది. అందాన్ని వికారంగా మారుస్తుంది. చాలామంది మహిళలు, యువతులకు శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమస్యల నుండి రక్షించుకోవడానికి తగినంత శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంతమవ్ఞతుంది.
ఫైన్ లైన్స్ (టోనింగ్)
బీ చలికాలంలో రోజూ రెండుసార్లు టమాటా రసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటరసంతో శరీరానికి సి విటమిన్ అందుతుంది. రోజూ తీసుకునే డైట్‌లో టమాటారసం తప్పనిసరి చేసుకోవాలి. టమాట రసం చర్మానికి టోనింగ్‌లా పనిచేస్తుంది.బీ కమలాపళ్లు తీసుకోవడం చర్మానికి చాలా మంచిది. ఈ పళ్లు టోనింగ్‌లా పనిచేసి నిగారింపు నిస్తాయి. 35ఏళ్లు పైబడ్డ వారు ఫ్రూటీ ఫేస్ ప్యాక్ వాడితే వారి చర్మం కాంతివంతమవ్ఞతుంది.
పండిన బొప్పాయి, తేనె, విటమిన్ ‘ఇ క్యాప్సూల్, స్కిమ్డ్ మిల్క్, కొద్దిచుక్కలు గ్లిజరిన్‌లు కలిపి పేస్టులా తయారుచేసుకోండి. ఈ పేస్టును ముఖంపై, మెడపై రాసుకోండి. ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే మెరిసే చర్మం మీ సొంతమవ్ఞతుంది.
మోచేతులు, మోకాళ్ల సంరక్షణ
చాలామంది మహిళలకు మోచేతులు, మోకాళ్లు నల్లగా, మొద్దుగా మారతాయి. వీటిని నివారించడానికి బాగా పండిన అరటిపళ్లను మెత్తగా చిదిమి అందులో చక్కెర వేయండి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు, మోకాళ్లకు రాయండి.
ఇలా కొద్దిరోజులు చేస్తే మార్పు కనిపిస్తుంది. దీంతో పాటు నిమ్మకాయను కోసి సగం ముక్కపై ఉప్పు రాసి ఆ ముక్కతో మోచేతులు, మోకాళ్లపై రుద్దితే నున్నగా మారతాయి.
అధరాల అందం
చలికాలంలో పెదవ్ఞలు పగలడం, పొడిబారడం సాధారణ సమస్య. వీటి నుండి బయట పడటానికి తేనె, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌లను గ్లిజరిన్‌తో కలిపి పెదవ్ఞలపై రాసుకోండి. ఆ తర్వాత స్ట్రాబెర్రీ, స్కిమ్డ్ మిల్క్, తేనెలను కలుపుకుని పెదాలకు రాసుకోండి. అందమైన పెదాలు మీ సొంతమవ్ఞతాయి.
కురుల శీతాకాలంలో జుట్టు వాతావరణ మార్పుల కారణంగా నిర్జీవంగా మారుతుంది. జుట్టు రక్షణ కోసం మెంతిపొడిని రాత్రంతా నానబెట్టి ఉంచండి. ఉదయం నానబెట్టిన మెంతి మిశ్రమంలో పెరుగు కలిపి జుట్టుకు బాగా పట్టించండి. కాసేపటి తర్వాత తలస్నానం చేయండి. మెంతిపొడి జుట్టుకు కండీషనర్‌గా పనిచేసి జుట్టు మెరుపును పెంచుతుంది.
ఫ్రెష్‌గా ఉండడం ఎలా?: చలి ఎంతగా ఉన్నా స్నానం చేయడం మాత్రం మరవొద్దు. గులాబీ, తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇది చర్మం కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది. కాచిన పాలలో గోధుమపిండి కలుపుకుని స్క్రబ్‌లా తయారుచేసుకోండి. ఈ స్క్రబ్‌ని రుద్దుకుంటే చర్మం శుభ్రపడుతుంది. స్క్రబ్ చేస్తే చర్మంపై నున్న మృతకణాలు తొలగిపోతాయి. దుమ్ము, ధూళి తొలగి పోతుంది. టైం లేదనుకునేవారు పొద్దున్నే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను స్నానం చేసే సగం నీళ్లలో వేసుకుని స్నానం అయిన తర్వాత ఒంటిపై నూనె కలిపిన నీళ్లను పోసుకోవాలి.
ఈ కాలంలో విటమిన్ ‘ఇ, ‘సిలు శరీరానికి చాలా మంచివి. చలి వాతావర ణంలో పాదాల పగుళ్లు తరచూ వేధించే సమ స్య. పాదాలు తరచూ ఇన్‌ఫెక్షన్‌కు గురవ్ఞతుం టాయి. అలాంటప్పుడు సబ్బుతో పాదాలను శుభ్రంగా కడగాలి. పాల కూర ఉడికించిన నీళ్లలో పాదాలను ఉంచాలి. ఇలా చేస్తే పాదాల పగుళ్లు తగ్గుతాయి
EmoticonEmoticon