కరోనా అంటే చాలు.. ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి సోకిందన్న వార్తలు దావనంలా వ్యాపించాయి. మరి ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.
ఈ వైరస్ ప్రభావం ఇక్కడే అధికం..
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్.. హైదరాబాద్‌లోనూ అడుగుపెట్టింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, , తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే, హైదరాబాద్‌కి చెందిన వ్యక్తికి కూడా ఈ లక్షణాలు కనిపించగా.. ప్రతి ఒక్కరూ కరోనా అంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే..వ్యాధి గురించి సరైన అవగాహన తెచ్చుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. అంటే ఈ వ్యాధి ఎలా వస్తుంది. ఎలాంటి లక్షణాలు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. ఇలాంటి విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం..
కరోనా అనే పేరు ఎలా వచ్చింది..
కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే అందరూ వణికిపోతున్నారు. రోజురోజుకీ వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్న ఈ వైరస్‌ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నా.. అవన్నీ అంత ప్రభావం చూపడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. నేడు వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. అయితే.. ఈ వైరస్‌ని మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకారంలోనే ఉంటుంది. దీంతో దానికి ఆ పేరు పెట్టారు.
కరోనా వైరస్ లక్షణాలు..
ఈ వ్యాధి సోకిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ముందుగా జలుబు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నలత, గొంతునొప్పి, చలిజ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది న్యూమోనియాకు దారి తీసి.. శరీర అవయవాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా వ్యాధికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తెలియని వారిని తాకకూడదు..
మనకు తెలియని వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి.. తెలియని వారిని ముట్టుకోవడం, తాకడం లాంటివి చేయకూడదు..
ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు : అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి కారకాలు.. ఒకర నుంచి మరొకరికి చేరే అవకాశం ఉంది. కాబట్టి తెలియని వారికి అంత సన్నిహితంగా మెలగడం మంచిది కాదు..
ఎప్పుడు మాస్క్ ధరించాలి : చాలా మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం చాలా మంచిది.
ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి
జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.
కరోనా వైరస్ ఉన్నట్లుగా ఏదైనా అనుమానంగా అనిపిస్తే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించొచ్చు.
* ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
* నీరు ఎక్కువగా తాగుతుండాలి.
2 Comments
Write CommentsHI NENUKUDA NELANTE BLOGGER NE MEKU ADS VACHAYIGA ALA VACHENEYO KONCHEMCHEPUTARA
ReplyNA BLOG aptronex.blogspot.com
ReplyEmoticonEmoticon