ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారపదార్థాలు తినాలి.. కొన్నింికి ఎంతో దూరం ఉంటే అంత మంచిది. అందులో చాక్‌లెట్స్ కూడా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో వీటిని తినడం వల్ల ఏం జరుగుతుంది. పుట్టే పిల్లలుకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి.
తల్లి ఆరోగ్యం బావుంటుందా.. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి.. చాక్లెట్స్.. చిన్ననాటి నుంచి వీటితో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. కొంతమంది పిల్లలకి ఏవైనా పనులు సరిగ్గా చేయాలంటే వారికి చాక్లెట్స్ ఇస్తామంటే చాలు.. వాటిని ఎంతో శ్రద్ధగా చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే వీటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తారు చాలా మంది తల్లిదండ్రులు. అంతలా చిన్నపిల్లలువీటికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు. ఈ అలవాటుని పిల్లల నుంచి మాన్పించేందుకు పెద్దల తలనొప్పి అని చెప్పొచ్చు. అంతగా చిన్నిపిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి చాక్లెట్స్....అయితే, చాక్లెట్స్ ఎక్కువగా తింటే అంత మంచిది కాదని అంటారు. కానీ, మోతాదులో చాక్లెట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బాధలో ఉన్నప్పుడు వీటిని తింటే ఒక్కసారిగా హ్యాపీ మూడ్ మారుతుందని చెబుతున్నారు నిపుణులు. కావాలంటే ఓ సారి మీరూ ట్రై చేయండి. వీటిని తినగానే ఇన్‌స్టంట్‌గా మీ పెదాలపై చిరునవ్వు వస్తుంది. వీటిలో ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ తినడం చాలా ముఖ్యం. వీటిని తినడం వల్ల బ్రెయిన్ కూడా షార్ప్‌గా పనిచేస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయట. కాబట్టి హ్యాపీగా వీటిని తినొచ్చు.
EmoticonEmoticon