జన్మ నక్షత్రాన్ని అనుసరించి పూజ చేయడం ద్వారా కర్మ ఫలితాలు తగ్గుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా మాసంలో వచ్చే జన్మ నక్షత్రాన్ని బట్టి పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జన్మ నక్షత్రం రోజున ఆలయాలను సందర్శించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతి నెలలో వచ్చే జన్మ నక్షత్రంలో ఆలయానికి చేరుకుని.. అర్చన చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.
ఎలాంటి దోషాలైనా మటుమాయం అవుతాయి. అందుకే జాతకులు తమ నక్షత్రాన్ని గుర్తించి ఆ రోజున ఆలయాల్లో అభిషేక ఆరాధనలు, ప్రత్యేక పూజలు చేయించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలా కుదరకపోతే.. ఆలయాల్లో ప్రమిదలతో నేతి దీపాలను వెలిగించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది.
జన్మ నక్షత్రంలో ఆలయాల్లో మూల విరాట్టుకు అభిషేకం చేయించిన తర్వాత పేదలకు అన్నదానం చేయడం మంచిది. జన్మ నక్షత్ర పూజలో కంటి దృష్టి లోపాలు తొలగిపోతాయి. విఘ్నాలు తొలగిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
EmoticonEmoticon