స్వాతి నక్షత్ర జాతకులు.. నృసింహ స్వామిని పూజిస్తే ఫలితం ఏమిటి

మంచి జరగాలంటే.. నరసింహ స్వామిని పూజించాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

భక్త ప్రహ్లాదునికి అండగా నిలిచిన.. ఆయన పలుకుకు పలికిన నృసింహ స్వామిని శనివారం పూట పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. నృసింహ స్వామికి ప్రీతికరమైన నక్షత్రం స్వాతి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు నృసింహ స్వామిని, యోగ నరసింహుడిని పూజించి.. దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
ఇంకా నరసింహునిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. శత్రుభయం వుండదు. అనుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కార్యాల్లో ఏర్పడే విఘ్నాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళ హోరలో నరసింహ స్వామిని పూజించడం ద్వారా చేపట్టిన కార్యాల్లో విజయం వరిస్తుంది.
మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు లేదా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల్లోపు నరసింహ స్వామిని పూజించడం ద్వారా శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గృహంలో శుభం చేకూరుతుందని.. ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Latest
Previous
Next Post »