తిన్న తర్వాత కొన్ని పనులు అసలు చేయకూడదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తిన్న తర్వాత ఈ పనులు చేయొచ్చని కొంతమంది వాదిస్తుంటారు. వారు చెప్పేవి నిజమో కాదో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరు. అందుకే ఎవరూ చెప్పకుండా మీరే తెలుసుకోవడానికి వీటిని చదవండి.
-ధూమపానం :
ఆరోగ్యానికి హానికరం. ఆహారం తీసుకున్న తర్వాత ధూమపానం చేస్తే ఒక సిగరెట్, పది సిగరెట్లతో సమానం. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
-నిద్ర :
నిద్ర జీవితంతో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అది కూడా తిన్న వెంటనే అసలు నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏర్పడుతుంది. కన్‌వీనియంట్‌గా ఉండదు.
-టీ, కాఫీ :
చాలామంది తిన్నవెంటనే టీ లేదా కాఫీ తాగకుండా ఉండలేరు. ఇలా చేయడం వల్ల విసర్జన సమస్యలు ఎదురవుతాయి. గంట సమయం తర్వాత తీసుకుంటే ఏం కాదు.
-స్నానం :
తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సరిగా ఉండదు. దీంతో బొజ్జ వస్తుంది. అంతేకాదు విరోచినాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే 30 నిమిషాలు అయినా గ్యాప్ ఇవ్వాలి.
-పండ్లు :
అన్నం తిన్న వెంటనే పండ్లు తినడం వల్ల తిన్నది అరగడానికి చాలా సమయం పడుతుంది. మళ్లీ గుండెల్లో మంటగా ఉంటుంది. శరీరంలో ఫ్యాట్ కూడా చేరుతుంది.
-లూజ్ చేయకూడదు :
భోజనం చేసిన వెంటనే కడుపు బిర్రుగా ఉంటుంది. దీంతో బెల్టును లూజ్ చేస్తారు. ఇలా ఎప్పటికీ చేయకూడదు. తినకముందు ఎలా ఉందో అలానే ఉంచుకోవాలి.
-నీరు తాగకూడదు :
తిన్న వెంటనే చల్లనీరు తాగకూడదు. ఇలా తాగడం వల్ల ఆహారం గడ్డకడుతుంది. దీనివల్ల కడుపునొప్పి వస్తుంది.
-వాకింగ్ :
తిన్న తర్వాత నడిస్తే మంచిది అనుకుంటారు. అది తప్పు. ఆహారానికి ముందు అరగంట తర్వాత నడవాలి అంటున్నారు. ఒకవేళ తిన్న తర్వాత చేయాలనుకుంటే అరగంట తర్వాత నడవడం మంచిది.
-జిమ్ :
ఆహారం అరిగకుండా జిమ్ అసలు చేయకూడదు. ఇలా చేస్తే వాంతింగ్ అయ్యే అవకాశం ఉంది.
-బ్రెష్ :
నిద్రపోయేముందు బ్రెష్ చేయడం మంచిది. అలా అని అన్నం తిన్న వెంటనే బ్రెష్ చేయకూడదు. కనీసం గంట, అరగంట సమయం తర్వాత చేస్తే మంచిది.
1 Comments:
Write Commentsమరి తిన్న వెంటనే ఏ పనులు చేయవచ్చు అవి కూడా చెప్పండి
ReplyEmoticonEmoticon