జంక్ ఫుడ్ మీద ఇష్టంతో ఇంటి ఫుడ్‌ని అశ్రద్ధ చేస్తుంటాం. అలాంటి ఇంటి ఫుడ్స్ లో బెస్ట్ అయిన మజ్జిగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* పాలులాగానే మజ్జిగని కూడా కంప్లీట్ ఫుడ్ అనొచ్చు. ఇందులో ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్స్, ఎసెన్షియల్ ఎంజైమ్స్ అన్నీ ఉన్నాయి.
* మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. అల్లం, జీలకర్ర పొడి కలిపిన మజ్జిగ తాగితే మసాల పదార్థాలు తిన్న తరువాత వచ్చే ఇరిటేషన్‌ని తగ్గించవచ్చు. మెనోపాజ్ టైంలో ఉన్న మహిళలకు మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.
* పొట్టలో గ్యాస్ తయారు కాకుండా చూస్తుంది. స్టమక్ ఇన్‌ఫెక్షన్స్‌ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
* మజ్జిగ ద్వారా కాల్షియం పొందవచ్చు. దీనివల్ల ఆస్టియో పొరాసిస్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు తప్పించుకోవచ్చు.
* మజ్జిగలో బీకాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. ఇవి ఎనీమియా నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే విటమిన్ డీ ఇమ్యూన్ సిస్టంని బలపరుస్తుంది.
* ప్రతిరోజూ మజ్జిగ తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
* ఉప్పు లేకుండా చేసిన పల్చటి మజ్జిగని నోటి లోపల అటూ ఇటూ తిప్పి మింగేస్తే నోటీలోని అల్సర్లు త్వరగా తగ్గుతాయి.
EmoticonEmoticon