పెసరపప్పు లోని ఔషద గుణాలు










పెసరపప్పు క్షణాల్లో ఉడుకుతుంది. రుచిలో అదిరిపోతుంది. పోషకాలతో పోటీ పడుతుంది. పెసరలో వ్యాధినిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.


ఒంట్లోని వేడిని, కఫాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. దీంట్లో విటమిన్‌ బి1, బి2 అధికంగా ఉండటం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
పెసరపప్పును ఉడకబెట్టి, నానబెట్టి రెండు రకాలుగాను వాడొచ్చు. పెసరపప్పుతో పచ్చడి, పెసరకట్టు మాత్రమే కాకుండా సలాడ్‌ కూడా తయారుచేసుకోవచ్చు.
తక్కువ సమయంలో జీర్ణమవుతుంది. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిది. వేసవిలో చలువ చేస్తుంది. మిగతా పప్పుల్లా కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఉండవు.
కొంతమందిలో మాత్రమే గ్యాస్‌ సమస్య ఎదురవుతుంది. పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, కాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, విటమిన్‌ ఎ1, బి1, బి2, పొటాషియం, సోడియం లాంటి పోషకాలెన్నో దీంట్లో ఉంటాయి.
మొలకెత్తిన పెసల్లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. కలరా, చికెన్‌ పాక్స్‌, వైరల్‌ ఫీవర్‌లు వచ్చినప్పుడు కూడా దీన్ని వాడవచ్చు. ఇది నీరసాన్ని తగ్గించి శక్తిని అందిస్తుంది.
చిన్న పిల్లలకూ మంచిది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే కచోరి తయారీలోను పెసరపప్పును వాడతారు. చాలా ప్రాంతాల్లో వేసవికాలంలో పెసరకట్టుని ఇష్టంగా చేసు కుని తింటారు.
పెసర పప్పును ఉడకబెట్టి వార్చి ఆ నీళ్లను తాలింపు వేసి దీన్ని తయారుచేస్తారు. కామెర్లు వచ్చిన వాళ్లకు కాలేయ సమస్యలు ఉన్న వాళ్లకు ఇది ఎంతో మంచిది.
ఇది గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లలకు మంచిది. త్వరగా జీర్ణమవుతుంది. నానబెట్టి నీళ్లు తీసిన పెసరపప్పులో తురిమిన కొబ్బరి, క్యారెట్‌, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేయాలి.
చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండాలి. వేసవిలో ఇలా చేసుకుని తినడం వల్ల చలువ చేస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. అధిక దాహాన్ని తగ్గిస్తుంది.


Previous
Next Post »