పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే ఆవాలు ఆరోగ్యానికి కొండంత అండగా ఉంటాయి. ఆవాల్లో ఫొటో న్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్థాలు ఉంటాయి.
అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల కేన్సర్లను నివారిస్తాయంటున్నారు నిపుణులు. అంతే కాకుండా మలబద్దకాన్ని కూడా తగ్గిస్తాయి. ఆవాల్లో సలీనియమ్, మెగ్నీషియమ ఎక్కువ. వాటి యాంటీ ఇన్ఫమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి. ఆవాలు ఆస్తమాను తగ్గిసాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతోపాటు జలుబు, ఛాతి పట్టేసినట్లు ఉండటంవంటి సమస్యలు తగ్గుతాయన్న విషయం ఇటీవలి పలు ఆధ్యయానలలో తేలింది. బరువు తగ్గడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి.
ఆవాలు విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాదు జీవక్రియలు బాగా జరుగుతాయి. ఆవాలలోని కెరో టిన్స్, జియాగ్జాం థిన్స్, ల్యూటిన్ వంటి పోషకాలు.. వయసు పెరగడం వల్ల శరీరంపై వచ్చే ముడతల్ని తగ్గిస్తాయి. మొత్తానికి ఆవాలను ఆహారంలో చేర్చుకోవడం వలన పలు ఆరోగ్య లాభలు పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
EmoticonEmoticon