importance of bhagavad gita |
భగవద్గీత అంటే అందరికీ ఇష్టమే. ప్రాక్పశ్చిమ దేశాల మేధావ్ఞలెందరెందరో దాని నుంచి ప్రేరణ పొందారు. కొందరికి మొత్తం ఏడువందల శ్లోకాలు ఇష్టమైతే మరి కొందరికేమో ఏదో ఒక అధ్యాయం చాలా ముఖ్యమైనదని పిస్తుంది.
కొందరు వారికి బాగా నచ్చిన ఒక్క శ్లోకాన్నిఎత్తి చూపి ఇందులో భగ వద్గీత మొత్తం సారం ఉందంటారు. ‘క్లైబ్సీం మా స్మగమం అను (సాంఖ్యయోగ్యం- 3వ శ్లోకాన్ని) శ్లోకాన్ని ఎత్తి చూపి వివేకానందస్వామి అందులో భగవద్గీత బోధ అంతా ఇమిడి ఉందంటాడు.
అట్లే భగవాన్ రమణమహర్షికి ఒక శ్లోకం బాగా నచ్చుతుంది. ఇక రామకృష్ణపరమహింస ‘గీత అనుమాటలే చాలు త్యాగాన్ని గుర్తు చేస్తాయంటాడు. సారమంతా అందులోనే ఉందంటాడు ఆయన. ఇందూరు మహారాణి అహల్యాబాయి హోల్కారు భగవద్గీత ధర్మాన్ని తెలుసుకోవాలని ఒక పండితున పిలిచి భగవద్గీతను తనకు బోధింపుమని అడిగింది. ఆయన ఒక శుభముహూర్తాన భగవద్గీత ప్రవచాన్ని ప్రారంభించి అందు తొలిశ్లోకంలోని తొలి పాదం ‘ధర్మక్షేత్ర కురుక్షేత్రే సమవేతాయుయుతుస్సం! అని చదివాడు. వెంటనే ఆ రాణ్యి ‘అయ్యా, భగవద్గీతా ధర్మంనాకర్థమైంది ఇక ఆపండి అన్నది. పైపాదంలోని పదాలకు కొంచెం మార్పుచేసి ‘క్షేత్రేక్షేత్రే ధర్మం కురు ఇదే కదా భగవద్గీత ధర్మమన్నది. పద్దెనిమిది పర్వాలుగల మహాభారతం మధ్యలో ఉంది గీత. పెద్దనిమిది అక్షౌహిణులతో పద్దెనిమిది రోజులు మహాభారత యుద్ధం జరిగింది. పద్దెనిమిది అధ్యాయాలు గల భగవద్గీతకు పద్దెనిమిది పేర్లున్నాయి. గీత మధ్యలో నున్న తొమ్మిదవ అధ్యాయాన్ని గర్చి చెబుతూ వినోబాభావే అంటాడు.
మహాభారతం మధ్యలో గీత. గీత మధ్యలో తొమ్మిదవ అధ్యాయం-జ్ఞానదేవుడు అంతిమ సమాధిలోనికి వెళ్లినప్పుడు ఈ అధ్యాయమును జపిస్తూ ప్రాణములు వదిలాడు. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నా హృదయం పొంగి కన్నీరు జలజలరాలును (పుట 134-గీతోపన్యాసాలు) కాబట్టి వినోబాభావేకు గీతలోని తొమ్మిదవ అధ్యాయమంటే ఎంత ఇష్టమో మనకు అర్ధమవుతుంది. భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయం ‘రాజ విద్యారాజగుహ్యయోగం ఈ అధ్యాయఫలితాన్ని, మహత్వంను గూర్చి పద్మపురాణములో ఒక కథ ఉంది.
పూర్వం కురుక్షేత్ర నగరమున చంద్రశర్మ అనురాజు సూర్యగ్రహణ కాలమున బ్రాహ్మణునకు కాలపురుషదానం చేయదలచి ఒక ఉత్తమ విప్రుని పిలిపించి కాలపురుష దానం చేశాడు. ఆ కాలపురుష విగ్రహము నుంచి చండాల దంపతులు ఉద్భవించి దానం తీసికొన్న ఆ బ్రాహ్మణుడిని పీడించటం మొదలుపెట్టారు. ఆ బ్రాహ్మణుడు గీతలోని తొమ్మిదవ అధ్యాయాన్ని పారాయణ చేశాడు. ఆ అధ్యాయం లోని ఒక్కొక్క అక్షరము నుండి ఒక్కొక విష్ణుదూత ఆవిర్భవించి ఆ చండాల దంపతులను పారద్రోలారు. దీన్నంతా చూస్తున్న రాజు ఆశ్చర్యపడి ఏ మంత్రాన్ని జపించారని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. భగవద్గీత లోని తొమ్మిదవ అధ్యాయాన్ని పారాయణ చేసినట్లు ఆ బ్రాహ్మణుడు రాజుకు చెప్పాడు.
Kavya
best lessons from bhagavad gita , importance of bhagavad gita
EmoticonEmoticon